మెరుగైన వైద్యం అందించాలి

మెరుగైన వైద్యం అందించాలి

తాడ్వాయి, వెలుగు: ప్రభుత్వాస్పత్రికి వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డిప్యూటీ డీఎంహెచ్​వో పివిన్ కుమార్ అన్నారు. గురువారం ములుగు జిల్లా తాడ్వాయి ప్రభుత్వ వైద్యశాల ఉద్యోగులకు డాక్టర్ రణధీర్ ఆధ్వర్యంలో మేడారం పల్లె దవాఖానలో వర్చువల్ అసెస్మెంట్ మీటింగ్ నిర్వహించారు.

ఈ మీటింగుకు హాజరైన పివిన్ కుమార్ మాట్లాడుతూ మేడారం, పల్లె దవాఖాన నేషనల్ క్వాలిటీ ఎస్యురెన్స్ స్టాండర్స్ స్కీం కింద సెలెక్ట్ అయిందని, రోగులకు అందిస్తున్న 14 రకాల రక్త, మూత్ర పరీక్షలను నాణ్యత ప్రమాణాలతో చేయాలని తెలిపారు. భవిష్యత్తులో మేడారం ఆస్పత్రికి మెరుగైన మౌలిక సదుపాయాలు వస్తాయని తెలిపారు. మీటింగ్ లో డీపీవో చిరంజీవి, డీడీఎం ప్రవీణ్, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ శ్యామ్, సబ్ యూనిట్ ఆఫీసర్ వెంకట్ రెడ్డి, హెచ్ఈవో సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.