ఖమ్మంలోని ఆర్​జేఆర్ హెర్బల్ హాస్పిటల్ సీజ్

ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మంలోని రాపర్తి నగర్ ఆర్​జేఆర్ హెర్బల్ హాస్పిటల్ ను డిప్యూటీ డీఎంహెచ్​వో సైదులు మంగళవారం సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాస్పిటల్ నిర్వాహకులు తమిళనాడులో మెయిన్ బ్రాంచ్ నడుపుతుండగా, 2021 నుంచి ఖమ్మం సబ్ బ్రాంచ్ గా హెర్బల్ హాస్పిటల్ నడుపుతున్నట్లు తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న హాస్పిటల్ లో అర్హత కలిగిన డాక్టర్లు కూడా లేరని చెప్పారు.

పేషెంట్లకు మోతాదుకు మించి మందులు ఇస్తున్నట్లు గుర్తించామన్నారు. రోజుకు 40 నుంచి 60 మంది రోగులకు ఓపీ చూస్తూ ఫీజుగా వేల రూపాయలు వసూలు చేస్తున్నట్లు విచారణ తేలిందని చెప్పారు. అనంతరం పట్టణంలో ఇటీవల అబార్షన్లు చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పెట్టుబడి సీజ్ అయిన హాస్పిటల్ ను ట్రైనీ ఐపీఎస్ మౌనిక తో కలిసి పరిశీలించారు. హాస్పిటల్ లో ఉన్న రికార్డ్స్ ను, ఓపీ కేసు షీట్లను, కంప్యూటర్లను హ్యాండ్ వర్ చేసుకున్నట్లు సైదులు చెప్పారు. తనిఖీలో డెమో కాసినాధ్, స్టాటిస్టికల్ ఆఫీసర్ జె.నవీన్ కుమార్, అకౌంటెంట్ ఉపేందర్ పాల్గొన్నారు.