గ్రేటర్ లో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, ఆ పార్టీకార్మిక విభాగం స్టేట్ చీఫ్ శోభన్ రెడ్డి రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖను బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు పంపించారు. పార్టీ అనుసరిస్తున్న విధానాలు తమను బాధించాయని లేఖలో పేర్కొన్నారు.
బీఆర్ఎస్ లో ఉద్యమకారులకు మనుగడ కరువైందని, కష్టకాలంలో మీతో ఉన్న ఉద్యమకారులకు పార్టీలో ప్రాధన్యత లేకపోవడం బాధించాయని లేఖలో తెలిపారు . పార్టీ కోసం 24 ఏళ్లుగా పనిచేశామని చెప్పారు. కాగా ఇటీవల మోతే శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. వీరు సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే వీరు సీఎం సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారని తెలుస్తుంది.