కొత్తపల్లి డంపింగ్ యార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో అవస్థలు

కొత్తపల్లి డంపింగ్ యార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో అవస్థలు
  •  బల్దియాలో విలీనమయ్యాక కరీంనగర్​ చెత్తంతా ఇక్కడికే.. 
  •  కాలుష్యంతో బాధపడుతున్న రామడుగు మండలం దేశరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి వాసులు 
  •  మరోచోటుకు తరలించాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

రామడుగు, వెలుగు: కొత్తపల్లి మున్సిపాలిటీ కోసం రామడుగు మండలం దేశరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి, పట్టణ శివారుల్లో ఎస్పారెస్పీ కెనాల్​పక్కన డంపింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యార్డు ఏర్పాటు చేశారు. దీంతో అప్పటి నుంచి దేశరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి గ్రామస్తులు అవస్థలు పడుతున్నారు. ఈ మున్సిపాలిటీ కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విలీనమయ్యాక ఈ సమస్య  తీవ్రమైంది. మనుషులు, పశువులు అనారోగ్యం బారిన పడుతున్నాయని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. డంపింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యార్డును తరలించాలని ప్రజాప్రతినిధులు, అధికారులను కోరినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. 

నాలుగేండ్ల కింద డంపింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యార్డు ఏర్పాటు 

కాకతీయ కాలువ నిర్మాణ సమయంలో మట్టికోసం అప్పటి ప్రభుత్వం దేశరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి రైతుల నుంచి భూసేకరణ చేసింది. ఈ భూముల నుంచి మట్టి తీయడంతో భారీ గుంతలు ఏర్పడ్డాయి. నాలుగేళ్ల క్రితం ఈ భూములను కొత్తపల్లి మున్సిపాలిటీ డంపింగ్ యార్డుకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటి నుంచి మున్సిపాలిటీ చెత్తంతా ఇక్కడే వేస్తున్నారు. ఇటీవల కొత్తపల్లి మున్సిపాలిటీని కరీంనగర్​కార్పొరేషన్​ విలీనం చేశారు. దీంతో కొత్తపల్లి చెత్తతో పాటు కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సేకరించిన చెత్తనంతా ఇక్కడికే తరలిస్తున్నారు. ప్రతిరోజు డంపింగ్ యార్డుకు తరలిస్తున్న చెత్తను తగలబెడుతుండడంతో దట్టమైన పొగ, దుమ్ముతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.  డంపింగ్ యార్డు చుట్టు ఉన్న పంట పొలాలు దెబ్బతింటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ లోపించడంతో డంపింగ్ యార్డు కాలుష్య కుంపటిగా మారిందని, పొగతో ఊపిరాడడంలేదని దేశరాజ్​పల్లి గ్రామస్తులు, రైతులు ఆరోపిస్తున్నారు. దీంతోపాటు డంపింగ్ యార్డుకు కోళ్లు, జంతువుల కళేబరాలు తరలిస్తుండడంతో దుర్వాసన భరించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీకి ఈ డంపింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యార్డు సమీపంలోనే ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. ఇటీవల చెత్తను తమ గ్రామశివారులోకి తరలించవద్దని బండ్లను ఆపి ఆందోళన చేపట్టారు. 

రెండురోజుల తర్వాత తరలించడం ఆపివేస్తామని హామీ ఇచ్చిన అధికారులు ఆ తర్వాత యథావిధాగా వాహనాల్లో చెత్తను తరలిస్తున్నారని ఆరోపిస్తున్నారు. డంపింగ్ యార్డును తొలగించాలని కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్​కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, అధికారులకు వినతిపత్రాలు అందజేసినా సమస్య పరిష్కారానికి నోచుకోవడంలేదంటున్నారు. 

డంపింగ్ యార్డు తొలగించాలని ఫిర్యాదులు చేసినం 

దేశరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి శివారు నుంచి డంపింగ్ యార్డును తొలగించాలని మా గ్రామస్తులందరూ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశాం. డంపింగ్ యార్డు నుంచి వెలువడుతున్న కాలుష్యంతో భూగర్భ జలాలు, వాయు కాలుష్యం బారినపడుతున్నాయి. రెండు నెలల కింద డంపింగ్​యార్డులోని చెత్త తిని మూడు పశువులు చనిపోయాయి. పోస్టుమార్టం చేస్తే పశువుల కడుపు నుంచి ప్లాస్టిక్​ కవర్లు, వైర్లు బయటకు వచ్చాయి. పాలకులు, అధికారులు స్పందించి డంపింగ్ యార్డును మరోచోటకు తరలించాలి. - దొబ్బల చంద్రయ్య, రైతు, దేశరాజ్​పల్లి, రామడుగు మండలం