
అశ్వారావుపేట, వెలుగు: మరాఠీ వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఆయన వారసులు, శివాజీ సేన మహారాష్ట్ర నుంచి ద్విచక్ర వాహనాలపై బయలుదేరి వైజాగ్ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ మంగళవారం అశ్వారావుపేట పట్టణానికి చేరుకుంది. రింగ్ రోడ్ సెంటర్ వద్ద విశ్వహిందూ పరిషత్, బీజేపీ నాయకులు ఛత్రపతి శివాజీ వారసులకు, శివాజి సేనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం పట్టణంలో ఛత్రపతి శివాజీ ఫొటోకు పాలాభిషేకం చేసి భారీ ర్యాలీ నిర్వహించారు.
హిందూ సామ్రాజ్యం ఏర్పాటు కోసం ఆయన చేసిన పోరాటాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ బాధ్యులు చవ్వా రమేశ్, శ్రీమంతుల పార్వతి, గొట్టాపు వెంకట అప్పారావు, చీమకుర్తి సుబ్బారావు, బీజేపీ నాయకులు చంద్రశేఖర్, శ్రావణ్, పాల్గొన్నారు.