పాండవుల వారసులట.. సోదరిని అత్తారింటికి పంపాలంటే..

  • ముళ్లకంపపై పడుకుని దొర్లుతారు

బైతుల్: పాండవుల వారసులమని నమ్మే రజ్జడ్ తెగ ప్రజలు.. పెళ్లయిన తమ సోదరిని అత్తారింటికి పంపాలంటే..ముళ్లకంపపై పడుకుని దొర్లుతారు. ఏటా ఓ నెలలో ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. ఈ ఆచారం చాలా ప్రమాదకరమని ఎవరైనా చెప్పినా ఈ తెగ ప్రజలు పట్టించుకోరు. తాము పాండవుల వారసులమని.. వారి తరహాలోనే తమ సత్యనిష్టను చాటుకుంటున్నామని చెబుతున్నారు. 
తమ పూర్వీకుల నుంచి వచ్చిన ఈ ఆచారాన్ని పాటించడం వల్ల దేవుడు తమ కుటుంబాన్ని ఆశీర్వదిస్తారని నమ్ముతున్నారు. అందుకే పెళ్లయిన సోదరికి వీడ్కోలు పలకడం కోసం ఈ ఆచారాన్ని పాటిస్తున్నట్లు చెబుతున్నారు. మధ్యప్రదేశ్ లోని బైతుల్ జిల్లాలోని సెహెరా గ్రామంలోని రజ్జడ్ తెగ ప్రజలు పాటిస్తున్న ఈ వింత ఆచారం తాజాగా  వెలుగులోకి వచ్చింది.