
అధిక విస్తీర్ణం, ఖండానికి ఉండాల్సిన భౌతిక, సాంఘిక, సాంస్కృతిక వైవిధ్యతలను కలిగి ఉండటంతో భారత్‌ను ఉపఖండం అని పిలుస్తారు. ఈ ఉపఖండంలోకి భారత్, పాకిస్తాన్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు వస్తాయి. సరిహద్దున ఉన్న ఏడు దేశాలతో 15,106.7 కి.మీ.ల పొడవైన భూ సరిహద్దును భారత్ కలిగి ఉంది. ఈ సరిహద్దును 16 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు పంచుకుంటున్నాయి. సరిహద్దును పంచుకుంటున్న ఏడు దేశాల అవరోహణ క్రమం కింది విధంగా ఉంది.
భారత్ VS చైనా
భారత్, చైనాల మధ్య ముఖ్యంగా మూడు వివాద ప్రాంతాలు ఉన్నాయి.
1. పశ్చిమ సెక్టార్: భారత్‌లోని లఢఖ్‌కు, చైనాలోని సికియాంగ్ ప్రావిన్స్‌కు మధ్య పశ్చిమ సెక్టార్ ఉంది. ఇక్కడ భారత భూభాగం ఆక్సాయ్‌చిన్‌ను చైనా ఆక్రమించుకుంది. ఇక్కడి సరిహద్దు రేఖను లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్(ఎల్‌ఓఏసీ) అంటారు.
2. మధ్య సెక్టార్: చైనాకు చెందిన టిబెట్ ప్రాంతానికి, భారత్‌లోని ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల మధ్య మధ్య సెక్టార్ ఉంది.
3. తూర్పు సెక్టార్: చైనాలోని టిబెట్ ప్రావిన్స్‌కు భారత్‌లోని అరుణాచల్‌ప్రదేశ్‌కు మధ్య తూర్పు సెక్టార్ ఉంది. ఇక్కడ భారత భూభాగం సమత్జంగ్ను చైనా ఆక్రమించుకుంది. ఈ ప్రదేశంలో భారత్, చైనాల మధ్య 1914లో మెక్‌మోహన్ రేఖను గీశారు. కానీ ఈ రేఖను చైనా అంగీకరించడం లేదు.
భారత్ VS పాకిస్తాన్
1948లో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో కశ్మీర్ పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లేదా ఆజాద్ కశ్మీర్, కశ్మీర్‌గా విడిపోయింది. పీవోకే, కశ్మీర్ మధ్య గల సరిహద్దునే సీజ్ ఫైర్ లైన్ అని ఆ తర్వాత జరిగిన సిమ్లా ఒప్పందం ప్రకారం ఈ సరిహద్దును లైన్ ఆఫ్ కంట్రోల్‌గా మార్చారు.
ఎ. జమ్ముకశ్మీర్, లఢఖ్‌లో సరిహద్దు రేఖలు
లఢఖ్‌లో వివాదాస్పద ప్రాంతం సియాచిన్. సవాయి నుంచి మాధవ్‌పూర్ వరకు అంతర్జాతీయ సరిహద్దు రేఖ అని, మాధవ్‌పూర్ నుంచి ఎన్జే9842 వరకు లైన్ ఆఫ్ కంట్రోల్ అని, ఎన్జే 9842 నుంచి ఇందిరాకాల్ వరకు ఆక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్ అని పిలుస్తున్నారు.
బి. రాడ్‌క్లిఫ్ అవార్డ్
రాడ్‌క్లిఫ్ అవార్డ్ ప్రకారం సర్ రాడ్‌క్లిఫ్ అనే వ్యక్తి 1947లో భారతదేశాన్ని మూడు భాగాలుగా విభజించారు. 1. భారత్, 2. పశ్చిమ పాకిస్తాన్, 3. తూర్పు పాకిస్తాన్(ప్రస్తుతం బంగ్లాదేశ్). ఈ రాడ్‌క్లిఫ్ రేఖ ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ మధ్య ఉంది.
సి. సర్ క్రిక్ వివాదం
ఈ వివాదం భారత్, పాకిస్తాన్ మధ్య ఉంది. ఇక్కడ పాకిస్తాన్ గీసిన 24 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని భారత్ గుర్తించడం లేదు.
డి. రాణా ఆఫ్ కచ్
ఇది భారత్, పాకిస్తాన్ల మధ్య ఉంది.
భారత్ VS ఆప్గనిస్తాన్
భారత్, ఆప్గనిస్తాన్‌ల మధ్య సరిహద్దు రేఖను డ్యూరాండ్ రేఖ అంటారు. ప్రస్తుతం ఇది భారత్, పాకిస్తాన్, భారత్, ఆఫ్గనిస్తాన్‌ల మధ్య ఉంది.
జల సరిహద్దులు
భారత్‌కు 6100 కి.మీ.ల ప్రధాన భూభాగ తీర రేఖ ఉంది. దీవులతో కలిపి తీరరేఖ పొడవు 7516 కి.మీ.
1. భారత్- శ్రీలంక
భారత్, శ్రీలంక మధ్య ఆడమ్స్ బ్రిడ్జ్, పాంబన్ దీవి, పాక్ జలసంధి, మన్నార్ సింధుశాఖ ప్రాంతాలు ఉన్నాయి. తమిళనాడుకు దక్షిణాన పాంబన్ దీవిలోని ధనుష్కోటి నుంచి శ్రీలంకలోని తలైమన్నార్ ప్రాంతం వరకు విస్తరించి ఉంది. పాక్ జలసంధి భారత్‌లోని పాయిండట్ కొడిక్కిరామ్ నుంచి శ్రీలంకలోని పీడ్మౌంట్ వరకు ఉంది. నాగర్‌కోయల్(తమిళనాడు) నుంచి శ్రీలంకలోని మన్నార్ వరకు విస్తరించి ఉంది.
2. భారత్- మాల్దీవులు
భారత్‌కు మాల్దీవులకు మధ్య 8 డిగ్రీల ఛానల్ ఉంది.
3. భారత్ – ఇండోనేషియా
గ్రేట్ నికోబార్ దీవికి, ఇండోనేషియాలోని సుమత్రా దీవికి మధ్య గ్రేట్ ఛానల్ ఉంది.
4. భారత్–థాయ్‌లాండ్
భారతదేశానికి థాయ్‌లాండ్‌కు మధ్య అండమాన్ సముద్రం ఉంది.
5. భారత్ – మయన్మార్
భారత్‌కు, మయన్మార్‌కు మధ్య కోకోఛానల్ ఉంది.
6. భారత్– బంగ్లాదేశ్
భారత్‌కు బంగ్లాదేశ్‌కు మధ్య గల న్యూమూర్ దీవి ఉంది.