![దేశ్ పాండే ఫౌండేషన్ ఆధ్వర్యంలో..స్కిల్ డెవలప్మెంట్ సెంటర్](https://static.v6velugu.com/uploads/2025/02/desh-pandey-foundation-to-set-up-skill-development-center-in-mahabubnagar_3YFibJMzPf.jpg)
మహబూబ్ నగర్, వెలుగు: మహబూబ్‌నగర్ లోని కేజీబీవీ, డిగ్రీ కాలేజీలో స్కిల్ ఫౌండేషన్ సెంటర్ ఏర్పాటుకు దేశ్ పాండే ఫౌండేషన్ సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. సీఎం సూచన మేరకు సంస్థ ఆధ్వర్యంలో కర్నాటక రాష్ట్రం హుబ్లీలో జరుగుతున్న కాన్ఫరెన్స్ కు ఎమ్మెల్యే హాజరయ్యారు.
సంస్థ చైర్మన్ గురురాజును కలిసి పాలమూరులో విద్యా వ్యవస్థ, ఉచితంగా అందిస్తున్న డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్, మహబూబ్‌నగర్ విద్యానిధి నవరత్నాలు తదితర కార్యక్రమాల గురించి వివరించారు. ఎమ్మెల్యే చేస్తున్న కృషిని చైర్మన్ అభినందించారు. మహబూబ్‌నగర్‌లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు అంగీకరించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.