రైతు కృషి: తమలాపాకుల సాగుతో అద్భుతాలు సృష్టిస్తున్నాడు

తమలాపాకుల సాగుతో అద్భుతాలు సృష్టిస్తున్నాడు ఓ రైతు.. తమలాపాకు సాగు అంటే ఓ ఉపాధి మార్గం మాత్రమే అనుకునేవారికి .. దీని ద్వారా మంచి లాభాలను పొందొచ్చని నిరూపించాడు. గత కొన్నేళ్లుగా దేశీయ తమలాపాకులను సాగు చేస్తూ..దేశం మొత్తం విక్రయించేందుకు లైసెన్స్ ను పొందాడు.మంచి లాభాలను పొందుతున్నాడు.. తమలాపాకుల బిజినెస్ కోసం ప్రభుత్వం లైసెన్స్ పొంది ఈ బిజినెస్ లో గుత్తాధిపత్యం చెలాయిస్తున్న ఆ రైతు గురించి తెలుసుకుందా రండి.. 

ఛత్తీస్గఢ్లోని రాజ్ నంద్ గావ్ ప్రాంతం తమలాపాకు సాగుకు ప్రసిద్ధి చెందింది. స్థానిక లభించే కర్పూరం తమలాపాకును జిల్లాలో ని చుయిఖదాన్ లో సాగు చేస్తారు. అయితే ఈ ప్రాంతానికి చెందిన రైతుకు ఈ తమలాపాకు సాగు భిన్నమైన మంచి పేరు తెచ్చి పెట్టింది. చుయిఖదాన్ లోని ధారా గ్రామానికి చెందిన బంటు రామ్ మహోబియా అనే రైతు ఇందిరాగాంధీ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల మార్గదర్శకత్వంలో తమలాపాకు సాగు చేస్తున్నాడు. తొమ్మిదేళ్లుగా ప్రసిద్ధి చెందిన కర్పూరం తమలాపాకును సాగు చేస్తున్నాడు. బంటు రామ్ కృషి, అంకిత భావం చూసి చత్తీస్ గఢ్ ప్రభుత్వం అతనికి తమలాపాకు సాగు, దేశం మొత్తం విక్రయించేందుకు గుత్తాధిపత్యం (కాంట్రాక్టు ) ఇచ్చింది. 

తమలాపాకు సాగుకు ప్రభుత్వం లైసెన్స్ ఇవ్వడంతో బంటు రామ్కు తొమ్మిదేళ్లుగా దేశీయ రకం తపలాపాకుల ఉత్పత్తి, అమ్మకం, మార్కెంటింగ్, ఎగుమతికి గుత్తాధిపత్యం లభించింది.దీంతో తను సాగు చేసిన తమలాపాకులను దేశమంతా ఎక్కడైనా అమ్ముకోవచ్చు. దశాబ్దాలుగా స్వదేశీ కర్పూరం తమలాపాకు సాగు చేస్తున్నందున బంటు రామ్ కు ఈ కాంట్రాక్టు దక్కింది. భారత దేశంలో తమలాపాకుల సాగుకు లైసెన్స్ పొందిన మొదటి రకం ఇదే. కోల్ కతా, బెంళూరులోని DSU కేంద్రాల్లో దీనికి పరీక్షించారు. 

కర్పూరం తమలాపాకు ప్రత్యేకత 
కర్పూరం తమలాపాకు ఆకులు పెద్దవి. గుండ్రంగా , లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. దీని కొమ్మ పొడవు 6.94 సెం.మీ., కొమ్మ మందం 1.69 సెం.మీ, ఆకు పొడవు 9.70 సెం.మీ. వెడల్పు 6.64 సెం.మీ.ఆకు బరువు 12.84 గ్రాములు.ఒక మొక్క నుంచి సగటున 80-85 ఆకులు లభిస్తాయి.

ALSO READ :- Nayanthara, Vignesh shivan: విడాకుల న్యూస్ వైరల్.. ఫోటోతో క్లారిటీ ఇచ్చిన నయన్

చత్తీస్ గఢ్ లోని వాతావరణం, తెల్లటినేల కర్పూరం తమలాపాకుల సాగుకు అనుకూలం.. కాబట్టి చుయిఖదాన్ తమలాపాకు ప్రసిద్ది చెందింది. చుయిఖదాన్ పాన్ అంటే దేశవ్యాప్తంగా ప్రసిద్ది. కోల్ కతా, వారణాసి, ముంబైత పాటు దేశంలోని పెద్ద నగరాల్లో ఈ తమలాపాకులు సరఫరా చేసేవారు. కానీ క్రమంగా వీటి సాగు విస్తీర్ణం తగ్గుతూ వచ్చింది. చత్తీస్ గఢ్ ప్రభుత్వం రైతులకు ఈ పాన్ ఆకులను సాగు చేసేందుకు లైసెన్సులు ఇవ్వడంతో ఈ ఆకులు మరోసారి వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు వీటి సాగు ఊపందుకుంది.