డిజైన్ డెమోక్రసీ ప్రారంభం

డిజైన్ డెమోక్రసీ ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: డిజైన్ ఫెస్టివల్ 'డిజైన్ డెమోక్రసీ 2024' హైదరాబాద్​లో శుక్రవారం ప్రారంభమైంది. ఈ నెల ఏడో తేదీ వరకు దీనిని హైటెక్స్ హాల్స్​లో నిర్వహిస్తున్నారు. కార్యక్రమానికి క్రియేటర్లు, ప్రొఫెషనల్స్,  డిజైన్ ప్రేమికులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వ ఐటీ, పరిశ్రమలశాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్, పింకీ రెడ్డి (ఫిక్కీ ఎఫ్​ఎల్​ఓ మాజీ చైర్ పర్సన్) ముఖ్య అతిథులుగా వచ్చారు. 

శైలేష్ రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పుత్ స్టూడియో,  అర్జున్ రాఠీల అత్యాధునిక లైటింగ్ డిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లేలు, స్టూడియో స్మితా మోక్ష్  కడారీ ఆర్ట్ గ్యాలరీ కళాఖండాలు, రోసాబాగ్, రవీష్ వోహ్రా హోమ్  సరితా హండా వంటి బ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ప్రొడక్టులు, తెలంగాణ మ్యూజియం ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి.  వివిధ అంశాలపై ఈ రంగంనిపుణులతో కూడిన బృందం చర్చలు కూడా జరిగాయి.