హైదరాబాద్, వెలుగు: డిజైన్ ఫెస్టివల్ ‘డిజైన్ డెమోక్రసీ’ అక్టోబర్ 4 నుంచి 6 వరకు హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరగనుంది. డిజైన్క్రియేటర్లు, నిపుణులు, ఔత్సాహికులు ఇందులో పాల్గొంటారు. తెలంగాణ నుంచి ఆరుగురు డిజైనర్లు వస్తున్నారని డిజైన్ డెమోక్రసీ ఫౌండర్ పల్లికా శ్రీవాస్తవ్ అన్నారు. ఇది బీ2బీ, బీ2సీ ఎగ్జిబిషన్ అని, కార్యక్రమం సందర్భంగా భారీ బిజినెస్జరిగే అవకాశం ఉందని చెప్పారు.
దేశవిదేశాల నుంచి వచ్చే డిజైనర్లు, కంపెనీలు 85 స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తారని ప్రకటించారు. లైటింగ్, ఫర్నిచర్, ఆర్కిటెక్చరల్, యాక్సెసరీస్సహా పలు ప్రొడక్టులను ప్రదర్శిస్తామని చెప్పారు.