వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు రూ. 1100 కోట్లు

వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు రూ. 1100 కోట్లు
  • 24 అంతస్తులతో  వరంగల్​ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
  • ప్రకటించిన మంత్రి హరీశ్.. డిజైన్లు ఖరారు
  • భవన నిర్మాణానికి రూ.1,100 కోట్లు కేటాయింపు
  • పరిపాలన అనుమతులు ఇస్తూ.. జీవో జారీ చేసిన సర్కార్

హైదరాబాద్, వెలుగు: వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డిజైన్లను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. 15 ఎకరాల్లో రూ.1100 కోట్లతో 24 అంతస్తుల్లో హాస్పిటల్ నిర్మించనున్నట్లు మంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు శనివారం ప్రకటించారు. హాస్పిటల్ డిజైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మీడియాకు విడుదల చేశారు. నిర్మాణానికి అయ్యే రూ.1100 కోట్లకు పరిపాలన అనుమతులు ఇస్తూ హెల్త్ సెక్రటరీ రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో రూ.105 కోట్లు మెడికల్ ఎక్విప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ కోసం ఖర్చు చేయనుండగా, మిగిలిన డబ్బులన్నీ బిల్డింగు నిర్మాణం, ఇతర పనుల కోసం వాడనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 2 వేల బెడ్లు అందుబాటులో ఉంటాయని హరీశ్‌‌‌‌‌‌‌‌రావు పేర్కొన్నారు. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఈఎన్టీ, డెర్మటాలజీ, ఆర్థోపెడిక్స్ తదితర స్పెషాలిటీ వార్డుల్లో 12 వందల బెడ్లు, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ, కార్డియాలజీ, కార్డియోథొరాసిక్, యూరాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ర్టోఎంటరాలజీ తదితర సూపర్ స్పెషాలిటీ వార్డుల్లో 8 వందల బెడ్లు కేటాయిస్తామని మంత్రి పేర్కొన్నారు. అవయవాల మార్పిడి, క్యాన్సర్ ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ కోసం ఇదే దవాఖానలో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. హాస్పిటల్ ఆవరణలో డెంటల్ కాలేజీ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కిడ్నీ, కాలేయం వంటి అవయవ మార్పిడికి సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయనున్నారు. కీమోథెరపీ, రేడియేషన్ సౌకర్యాలతో అత్యాధునిక క్యాన్సర్ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే అక్కడ కాకతీయ మెడికల్ కాలేజీ, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఉన్నాయి. హాస్పిటల్ ప్రాంగణంలోనే మెడికోలు, డాక్టర్లకు నివాస సముదాయాలు, పేషెంట్ల అటెండర్లకు వసతి గృహాలు నిర్మించబోతున్నట్టు మంత్రి వెల్లడించారు.

స్వయం ప్రతిపత్తి!
కాకతీయ మెడికల్ కాలేజీని కాళోజీ హెల్త్ యూనివర్సిటీకి అనుబంధంగా మార్చనున్నట్టు హెల్త్ ఆఫీసర్లు చెబుతున్నారు. ప్రస్తుతం కాలేజీకి ఎంజీఎం అనుబంధ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంది. కొత్తగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ దవాఖానను కూడా ఈ కాలేజీకి అనుబంధంగా మార్చనున్నారు. ఇదే హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అనుబంధంగా మరో డెంటల్ కాలేజీని కూడా తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు. వీటన్నింటినీ హెల్త్ వర్సిటీకి అనుబంధ సంస్థలుగా మార్చి, నిమ్స్ తరహాలో స్వయం ప్రతిపత్తి హోదా కల్పించనున్నారు. ప్రస్తుతం ఈ అంశం చర్చల స్థాయిలోనే ఉందని, హాస్పిటల్ నిర్మాణం తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మెడికల్ ఎడ్యుకేషన్ విభాగం ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

33 నుంచి 24కు
సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను 33 అంతస్తుల్లో నిర్మించబోతున్నట్టు, హాస్పిటల్ భూమి పూజ సందర్భంగా కేసీఆర్ ప్రకటించారు. ఇందుకోసం మంత్రులు, అధికారులు బృందాన్ని కెనడాకు వెళ్లి అక్కడి పెద్ద హాస్పిటళ్లను పరిశీలించి రావాలని ఆదేశించారు. కరోనా కారణంగా పర్యటనకు వెళ్లలేకపోయామని ఆఫీసర్లు చెబుతున్నారు. దీంతో 33 అంతస్తులు కాస్తా 24కు తగ్గడం గమనార్హం. మంత్రి విడుదల చేసిన డిజైన్ల ప్రకారం హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మూడు భాగాలుగా నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో ఒక బిల్డింగ్ మాత్రమే 24 అంతస్తులు ఉండనుంది. మిగిలిన రెండు భవనాలు15 అంతస్తులలోపు నిర్మించనున్నారు.