ముంబై : అమెరికాలో చదువుకోవాలనే భారతీయుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. 2022-23లో అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్ ఆల్ టైం రికార్డ్ సృష్టించారు. 2లక్షల 68వేల923 మంది విద్యా్ర్థులు అమెరికాలో చదువుతున్నారని.. ఇది విదేశాల నుంచి వచ్చి అమెరికాలో చదువుతున్న విద్యార్థులలో భారత్ నుంచి వచ్చే వారి సంఖ్య ఎక్కువ అని నివేదికలు చెపుతున్నాయి. యూఎస్ క్యాంపస్ లలో మొత్తం అంతర్జాతీయ విద్యార్థుల జనాభా మిలియన్ మార్క్ ను దాటడంతో ప్రతి నలుగురు విదేశీ విద్యార్థులలో కనీసం ఒకరు భారతీయ విద్యార్థులున్నారు.
గతేడాది కంటే ఈ సంవత్సరం అమెరికాలో చదువుతున్న విద్యార్థుల సంఖ్య 35 శాతం పెరిగింది. గ్రాడ్యుయేట్లు లక్షా 65వేల 936 మంది ఉండగా.. అండర్ గ్రాడ్యుయేట్లు 31వేల 954 మంది ఉన్నారు.
భారతీయ గ్రాడ్యుయేట్ విద్యార్థు సంఖ్య 63 శాతం పెరిగింది. అండర్ గ్రాడ్యుయేట్లలో 16 శాతం పెరుగుదల ఉంది.69వేల 062 మంది విద్యార్థులతో ఐచ్ఛిక ప్రాక్టికల్ ట్రైనింగ్ లో భారత్ మొదటి స్థానంలో కొనసాగుతోంది అని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషన్ ఎడ్యుకేషన్ లో పరిశోధన విభాగం అధిపతి మిర్కా మార్టెల్ అన్నారు.
సర్వేల ప్రకారం.. 70 శాతం అమెరిన్ విద్యాసంస్థలు భారతదేశ అండర్ గ్రాడ్ ఔట్రీచ్ కు ప్రాధాన్యత ఇస్తున్నాయి. రికార్డుస్థాయిలో భారతీయులకు వీసాలు (1.4లక్షలకు)జారీ చేసేందుకు యూఎస్ కాన్సులేట్ ఆఫీసులు ఓవర్ టైమ్ పనిచేయడం ఇందుకు నిదర్శనం. 20యేళ్లలో అత్యధిక వీసాలుఅందించాయని మిర్కా మార్టెల్ అన్నారు.
Also Read:- ఇలాంటి అమ్మాయిలు కూడా ఉంటారా.. పబ్ కు పిలిచి బకరాను చేసింది