ప్రపంచవ్యాప్తంగా చాలా మంది తమ పర్సనల్ అండ్ వర్క్ చాట్‌ల కోసం వాట్సాప్(WhatsApp)ని ఉపయోగిస్తున్నారు. మెటా యాజమాన్యంలోని ఈ మెసేజింగ్ యాప్.. యూజర్స్ ను మొబైల్, టాబ్లెట్‌లు, డెస్క్‌టాప్‌ల వంటి వివిధ పరికరాలలో ఏకకాలంలో కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. అయితే, ఆఫీస్ సెట్టింగ్‌లో డెస్క్‌టాప్‌లో వాట్సాప్‌ను ఉపయోగించడం వల్ల ఎవరైనా మీ స్క్రీన్‌ని చూస్తే అసౌకర్యానికి గురి కావచ్చు.
వర్క్ లో WhatsApp డెస్క్‌టాప్ వెర్షన్‌ను ఉపయోగిస్తున్నప్పుడు, మన ప్రైవేట్ చాట్‌లను ఇతరులు చూస్తారనే ఆందోళన కలగడం సర్వసాధారణం. అలా కనిపించినప్పుడు కాస్త ఇబ్బందికరంగా అనిపించడం జరుగుతూంటుంది. దీన్ని నివారించడానికి, మనలో చాలా మంది పర్సనల్ చాట్‌లను ఆర్కైవ్ చేయడం లేదా డెస్క్‌టాప్‌లలో యాప్‌ను ఉపయోగిస్తున్నప్పుడు సున్నితమైన సంభాషణలను నివారించడం చేస్తుంటారు. కానీ దీనికి WA వెబ్ ప్లస్ అనే వెబ్ ఎక్స్‌టెన్షన్ దీనికి పరిష్కారం. దీన్ని ఎలా చేయాలంటే..
- Chrome వెబ్ స్టోర్‌ని ఓపెన్ చేసి "WA Web Plus for WhatsApp" కోసం సెర్చ్ చేయండి.
- "Add to Chrome" అనే ఆప్షన్ ను క్లిక్ చేయండి.
- ఆ తర్వాత, మీ బ్రౌజర్‌ని మూసివేసి, మళ్లీ ఓపెన్ చేయండి.
- ఇప్పుడు Google Chromeలో WhatsApp వెబ్‌కు లాగిన్ చేయండి.
- ఇక్కడ మీరు చాట్‌లను హైడ్ అండ్ బ్లర్ చేయడం వంటి ఆప్షన్ ను చూడవచ్చు.
ప్రైవసీతో పాటు, ఈ ఎక్స్ టెన్షన్ ఇతర ఈజీ టూల్స్ ను కూడా కలిగి ఉంటుంది. మీ కంప్యూటర్ నుండి వైదొలిగేటప్పుడు మీ చాట్‌లను ప్రొటెక్ట్ గా ఉంచేందుకు మీరు దీనికి పాస్‌వర్డ్‌ను సెట్ చేయవచ్చు. ముఖ్యంగా విరామ సమయంలో ఇది ఉపయోగపడుతుంది. వాట్సాప్‌లోనే డెస్క్‌టాప్ యాప్ కోసం లాక్ ఫీచర్ కూడా ఉంది.
ALSO READ: గూగుల్ అలర్ట్ : లక్షల అకౌంట్లు డిలీట్.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే..!
అంతేకాకుండా, చాట్ ఫోల్డర్‌లు, సంభాషణల సారాంశాలను సృష్టించడానికి ఎక్స్ టెన్షన్స్ మిమ్మల్ని అనుమతిస్తుంది. ఇది ఇప్పటివరకు మంచి రివ్యూలను కూడా అందుకుంది. ఇలా చేయడం సురక్షితంగా అనిపించినప్పటికీ, మీరు Google Chromeలోని ఎక్స్ టెన్షన్ పై రైట్-క్లిక్ చేసి, టూల్‌బార్ నుంచి "Remove from Chrome" అనే ఆప్షన్ ను ఎంచుకోవడం ద్వారా ఎప్పుడైనా దాన్ని అన్‌ఇన్‌స్టాల్ చేయవచ్చు. ఈ విధంగా, మీరు వర్క్ లో మీ WhatsApp ఎక్స్ పీరియన్స్ ను పొందవచ్చు.