గుంటూరులో వేంకటేశ్వరస్వామి విగ్రహానికి అపచారం జరిగింది. ఇద్దరు వ్యాపారస్తులు ఆ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే... బృందావన్ గార్డెన్స్ లోని శ్రీ వెంకటేశం అపార్ట్ మెంట్ లో కలియగ దేవుడు శ్రీవేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించి.. కొంత కాలం పూజలు చేస్తున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి ఇద్దరు వ్యాపారస్తులకు నష్టం వచ్చిందని.. వెంకన్న స్వామికి పూజించినా కరుణ చూపలేదని ... ఆ ఇద్దరు వ్యాపారులు స్వామి వారి విగ్రహాన్ని ద్వంసం చేశారు. ఈ ఘటనపై అపార్ట్మెంట్ కమిటి అధ్యక్ష .. కార్యదర్శులు పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.