- ఐఈడీ బాంబులను గుర్తించి నిర్వీర్యం చేసిన
- చత్తీస్‌గఢ్ పోలీసులు
భద్రాచలం, వెలుగు : మావోయిస్టుల కుట్రను చత్తీస్గఢ్పోలీసులు భగ్నం చేశారు. బీజాపూర్జిల్లా గంగులూరు పీఎస్ పరిధిలోని ముట్వెండి-పెడియా అటవీ ప్రాంతంలో కూంబింగ్‌కు వచ్చే జవాన్లను హతమార్చేందుకు ఐఈడీ బాంబులను మావోయిస్టులు భూమిలో అమర్చారు. దీన్ని ముందే పసిగట్టిన భద్రతా బలగాలు పక్కా సమాచారంతో గురువారం ఆ ప్రాంతంలో బాంబు డిస్పోజల్ స్వ్కాడ్ సాయంతో సోదాలు చేపట్టి ఐఈడీ బాంబులను గుర్తించి నిర్వీర్యం చేశాయి. దీంతో అప్రమత్తమైన బీజాపూర్పోలీసులు అదనపు బలగాలను రంగంలోకి దించి కూంబింగ్ఆపరేషన్ముమ్మరం చేశారు.