అణు జలాంతర్గామి ఐఎన్ఎస్​ అరిఘాత్​

అణు జలాంతర్గామి ఐఎన్ఎస్​ అరిఘాత్​

భారత నౌకాదళం మరో మైలురాయిని చేరుకున్నది. పూర్తిగా అణు సామర్థ్యంతో కూడిన దేశ తొలి బాలిస్టిక్​ క్షిపణి వ్యవస్థ కలిగిన న్యూక్లియర్​ మిసైల్​ జలాంతర్గామి ఐఎన్​ఎస్​ అరిహంత్​ స్ఫూర్తి, డిజైన్​ అనుభవంతో మరో అణు జలాంతర్గామి ఐఎన్​ఎస్​ అరిఘాత్​ను భారత నౌకాదళం నిర్మించింది. 

  • తూర్పు నౌకాదళానికి చెందిన యుద్ధనౌకల స్థావరం విశాఖపట్నం నేవల్​ డాక్​యార్డులోని షిప్​ బిల్డింగ్​ సెంటర్​లో 2011, డిసెంబర్​లో అరిహంత్​ మాదిరిగానే అరిఘాత్​ నిర్మాణాన్ని చేపట్టారు. 
  • తొలి దశ నిర్మాణం తర్వాత 2017, నవంబర్​ 19న జల ప్రవేశం చేయించారు. అనంతరం అంతర్గత విభాగాల పరికరాల బిగింపు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రాడార్ వ్యవస్థ, ఆయుధ సంపత్తిని సమకూర్చడం వంటి కీలక పనులన్నింటినీ పూర్తి చేశారు. సీ ట్రయల్స్​ ప్రక్రియను పలు దఫాలుగా చేపట్టారు.