వన్ నేషన్.. వన్ ఎలక్షన్: రాష్ట్ర ప్రభుత్వాలు పడిపోతే.. మళ్లీ ఎన్నికలు.. కాకపోతే మిగతా కాలానికే..

వన్ నేషన్.. వన్ ఎలక్షన్: రాష్ట్ర ప్రభుత్వాలు పడిపోతే.. మళ్లీ ఎన్నికలు.. కాకపోతే మిగతా కాలానికే..

కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టింది. వన్ నేషన్ –వన్ ఎలక్షన్ పేరుతో 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ అర్జున్ రామ్ మేఘ్వాల్ 2024 డిసెంబర్ 17వ తేదీన కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్ సభ ముందుకు తీసుకొచ్చారు. ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొంది చట్టరూపం దాలిస్తే.. దేశ ఎన్నికల విధానంలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ప్రస్తుతం రాజ్యాంగం ప్రకారం.. ఏదైనా ఒక రాష్ట్ర అసెంబ్లీ రద్దు అయితే తిరిగి ఆరు నెలల్లో  ఎన్నికలు నిర్వహిస్తారు. 

కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం ఐదేళ్లు పాటు అధికారంలో ఉంటుంది. కానీ జమిలి ఎన్నికల చట్ట ప్రకారం.. ఏదైనా ఒక రాష్ట్ర అసెంబ్లీ రెండు సంవత్సరాలకు రద్దు అయితే.. ఆ రాష్ట్రంలో తిరిగి మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తారు. కానీ అధికారంలోకి వచ్చిన పార్టీ ఐదేళ్లు కాకుండా.. మిగిలిన మూడు సంవత్సరాలు మాత్రమే పవర్‎లో ఉంటుంది. అనంతరం లోక్ సభ ఎన్నికలతో పాటు ఆ రాష్ట్ర అసెంబ్లీకి మళ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వం ఐదేళ్ల పాటు అధికారంలో కొనసాగవచ్చు.  

Also Read:-తక్షణమే ఉపసంహరించుకోండి.. జమిలి ఎన్నికల బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్

దేశంలో ఎన్నికల సంస్కరణల్లో భాగంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ జమిలీ ఎన్నికల విధానానికి సిద్ధమైంది. దేశంలో పార్లమెంట్, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడమే జమిలి ఎన్నికల బిల్లు ఉద్దేశం. ఇందులో భాగంగా జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేృత్వత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది మోడీ సర్కార్. రామ్ నాథ్ కోవింద్ కమిటీ జమిలి ఎన్నికల విధానంపై లోతుగా అధ్యాయనం చేసి కేంద్ర ప్రభుత్వానికి ఒక రిపోర్టు సమర్పించింది.

ఈ నివేదికకు సెంట్రల్ గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలోనే జమిలి ఎన్నికలకు సంబంధించిన రెండు బిల్లులను గత వారమే కేంద్ర కేబినేట్ ఆమోదించింది. రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు కేంద్రపాలిత చట్టాల సవరణ బిల్లు-2024ను రెడీ చేసి తాజాగా లోక్ సభలో ప్రవేశ పెట్టింది కేంద్రం. ఈ బిల్లుల సారాంశమేమిటంటే.. ఢిల్లీ, జమ్మూకశ్మీర్, పాండిచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినది ఒకటి.

ఏదైన అసెంబ్లీకి ఎన్నికలను లోక్ సభతో పాటు నిర్వహించలేకపోతే.. ఆతర్వాత  వాటిని జరిపే వీలు జమిలి ఎన్నికల బిల్లులో ఉంది. దీనిపై రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేయాలి. ఏదైన ఒక అసెంబ్లీకి  ఎన్నికలు నిర్వహించలేమని ఎన్నికల సంఘం అభిప్రాయపడినప్పుడు.. వాటిని తర్వాత నిర్వహిస్తామని రాష్ట్రపతికి సిఫార్సు చేసే అవకాశం 129వ రాజ్యాంగ సవరణ బిల్లులోని సెక్షన్ 2క్లాజ్ 5 కల్పిస్తుంది. రాష్ట్రపతి ఆదేశాలతో వాటిని తర్వాత నిర్వహించుకోవచ్చు.