ఢిల్లీ బ్లాస్ట్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో దొరికిన లెటర్‌‌‌‌‌లో ఏముందంటే?

  • ఇది ట్రైలరే.. రోజులు లెక్కబెట్టుకో
  • ఇజ్రాయెల్‌‌‌‌ అంబాసిడర్‌‌‌‌ను బెదిరిస్తూ లెటర్‌‌‌‌
  • ఢిల్లీ బ్లాస్ట్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో వదిలిన లెటర్‌‌‌‌ వివరాలు బయటకు

న్యూఢిల్లీ: ఢిల్లీ బాంబు దాడి కేసులో కీలక విషయాలు బయటపడుతున్నాయి. బ్లాస్ట్‌‌‌‌ చేసింది తామేనని ఉగ్రవాద సంస్థ ఇండియా హిజ్‌‌‌‌బుల్లా ఇప్పటికే ప్రకటించగా.. తాజాగా ఆ బ్లాస్ట్‌‌‌‌ జరిగిన ప్రాంతంలో వదిలి వెళ్లిన లెటర్‌‌‌‌లోని విషయాలను ఓ మీడియా సంస్థ వెల్లడించింది. ఇజ్రాయెల్‌‌‌‌ అంబాసిడర్‌‌‌‌ను బెదిరిస్తూ లెటర్‌‌‌‌ రాశారని.. ఇరాన్‌‌‌‌ న్యూక్లియర్‌‌‌‌ సైంటిస్టును, రివల్యూషనరీ గార్డ్స్‌‌‌‌ కమాండర్‌‌‌‌ను చంపినందుకు బదులు తీర్చుకుంటామని అందులో చెప్పారని పేర్కొంది. ‘నీ ప్రతి కదలిక తెలుసు. నీ పేరెంట్స్‌‌‌‌పైనా నిఘా పెట్టాం. రోజులు లెక్కబెట్టుకో. ఇప్పుడు ట్రైలర్‌‌‌‌ చూపిద్దామని వచ్చాం’ అని లెటర్‌‌‌‌లో రాశారంది. ‘నీ చుట్టూ ఉన్న అమాయకుల రక్తం కళ్లజూడాలనుకోవట్లేదు’ అని కూడా చెప్పారని వివరించింది.

బాంబు కేసు విచారణ ఎన్‌‌‌‌ఐఏకు..

ఢిల్లీ బాంబు పేలుడు కేసును ఇకపై ఎన్‌‌‌‌ఐఏ దర్యాప్తు చేయనుంది. ఈ మేరకు కేసును ఎన్‌‌‌‌ఐఏకు కేంద్ర హోం శాఖ అప్పగించిందని అధికారులు వెల్లడించారు. ఘటనపై ఇప్పటికే దర్యాప్తును ప్రారంభించిన కేంద్రం ఇద్దరు అనుమానితులను  గుర్తించింది. పేలుడు వెనుక ఎవరున్నారో ఇంకా తెలియదంది.

For More News..

ఐసీసీ అవార్డు రేసులో పంత్

మా బండ్లలో డీజిల్ పోయిస్తే.. నీ బిడ్డను వెతుకుతం

ఆరుసార్లు జాక్‌‌‌‌పాట్‌‌‌‌ కొట్టిన అదృష్టవంతుడు