ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐఓఎం) విడుదల చేసిన వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ – 2024 ప్రకారం విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు 2022లో స్వదేశానికి 111.22 బిలియన్ డాలర్లను పంపారు. ఇప్పటి వరకు ఏ దేశానికి కూడా రెమిటెన్స్ ఈ స్థాయిలో డబ్బులు తమ స్వదేశానికి పంపిన దాఖలాలు లేవు. అంతేకాకుండా 100 బిలియన్ డాలర్లు దాటడంలో కూడా భారతదేశం మొదటి స్థానంలో నిలిచింది.
రెమెటెన్సులకు సంబంధించి భారత్ తర్వాత నాలుగు స్థానాల్లో మెక్సికో (61 బిలియన్ డాలర్లు), చైనా (51 బిలియన్ డాలర్లు), ఫిలిప్పైన్స్, ఫ్రాన్స్ నిలిచాయి. 2021లో చైనా ద్వితీయ స్థానంలో ఉండగా, ఆ స్థానాన్ని 2022లో మెక్సికో అధిగమించింది.
దక్షిణాసియా దేశాల నుంచి అత్యధిక సంఖ్యలో వలస కార్మికులు ఉండటంతో ఈ ప్రాంతం ప్రపంచవ్యాప్తంగా రెమిటెన్స్కు సంబంధించి అతిపెద్ద మొత్తాలను పొందుతున్నది. దక్షిణాసియాలో భారతదేశంతోపాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్ రెమిటెన్సులకు సంబంధించి టాప్–10 దేశాల్లో ఉన్నాయి.
అంతర్జాతీయంగా పాకిస్తాన్ 30 బిలియన్ డాలర్లతో ఆరో స్థానంలో ఉండగా, బంగ్లాదేశ్ 215 బిలియన్ డాలర్లతో ఎనిమిదో స్థానంలో నిలిచింది.
44.8 లక్షల మంది వలసదారుల గమ్యస్థాన దేశంగా భారతదేశం 13వ స్థానంలో నిలిచింది. విద్యార్థులను ఆకర్షించడంలో తొలి దేశంగా అమెరికా (8,33,000) ఉండగా, తర్వాత స్థానాల్లో బ్రిటన్ (6,01,000), ఆస్ట్రేలియా ( 3,78,000), జర్మనీ (3,76,000), కెనడా (3,18,000) ఉన్నాయి.
భారత్కు అందిన రిమిటెన్సులు (బిలియన్ డాలర్లలో) 2010 –53.48, 2015–68.91, 2020–83.15, 2022–111.222