నల్గొండ పట్టణంలో అధ్వానంగా మారిన మెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్లు

  • వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యూరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేకపోవడంతో పెద్ద ఎత్తున లేస్తున్న దుమ్ము
  • ఇబ్బందులు పడుతున్న వాహనదారులు, ప్రజలు 
  • అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందంటున్న డాక్టర్లు

నల్గొండ, వెలుగు : అభివృద్ధి పనుల పేరుతో నల్గొండ పట్టణంలో రోడ్లను అడ్డంగా తవ్వి వదిలేయడంతో ప్రధాన రోడ్లతో పాటు, గల్లీలు సైతం అధ్వానంగా మారాయి. ఏడాది కిందటే పూర్తి చేయాల్సి ఉన్నా రోడ్ల పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రోడ్లు తవ్విన చోట హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతుండగా, రోడ్డు నుంచి లేస్తున్న దుమ్ముతో స్థానికులు, వ్యాపారులు అనారోగ్యానికి గురవుతున్నారు. 

ఆలస్యం అవుతున్న అభివృద్ధి పనులు

నల్గొండలోని క్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి నలువైపులా రోడ్ల పనులు చేపట్టారు. హైదరాబాద్, దేవరకొండ వైపు వెళ్లే రోడ్లను వెడల్పు చేస్తుండగా, క్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి పానగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బైపాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరకు రూ. 100 కోట్లతో అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్రైనేజీ నిర్మిస్తున్నారు. పైప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేసే పనులు పూర్తయ్యాయి. దానిమీద రోడ్డు వేసే పనులను నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైవే అథారిటీ చేపట్టాల్సి ఉంది. కానీ ఆ పనులు స్టార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కావడానికి ఇంకా టైం పడుతుందని ఆఫీసర్లు చెబుతున్నారు.ఇక ఎప్పుడో పూర్తి కావాల్సిన హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్డు నిర్మాణ పనులు కోర్టు కేసుల వల్ల లేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవుతున్నాయి. దీంతో డివైడర్ల మధ్యలో మొక్కలు నాటడం కోసం తీసుకొచ్చిన మట్టిని రోడ్లపైనే పోసి వదిలేశారు. క్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్డు విస్తరణ కోసం రూ.30 కోట్లు ఖర్చు పెట్టిన సర్కార్, ఇప్పటివరకు చేసిన పనులకు పేమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయలేదు. బిల్లులు రావడం లేదన్న ఉద్దేశంతో ఆఫీసర్లు సైతం కాంట్రాక్టర్లను ఏమీ అనలేకపోతున్నారు.

పెద్ద ఎత్తున లేస్తున్న దుమ్ము

తవ్విన రోడ్లపై దుమ్ము లేవకుండా వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యూరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాల్సిన బాధ్యత మున్సిపాలిటిదే. కానీ వారు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. దీంతో వాహనాలు వెళ్తున్న టైంలో పెద్ద ఎత్తున దుమ్ము లేస్తుండడంతో బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, ఆటోల్లో వెళ్లేవారు, పండ్లు, టిఫిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్ల నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను పరిష్కరించాలని ఆఫీసర్లను కోరినా స్పందించడం లేదని ప్రజలు వాపోతున్నారు. దుమ్ము కారణంగా ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోలీసులు సైతం డ్యూటీ చేయలేకపోతున్నారు. దుమ్ము, ధూళి కారణంగా ప్రజలు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని డాక్టర్లు చెబుతున్నారు.

దుమ్ముతో ఇబ్బందులు పడుతున్నాం

రోడ్డు పనులను మధ్యలోనే వదిలేయడం వల్ల వాహనాలు వెళ్తున్నప్పుడు పెద్ద ఎత్తువ దుమ్ము లేస్తోంది. దీంతో మాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేకుండా దుకాణంలో కూర్చోవాలంటే ఇబ్బందిగా ఉంది. 
- తేలుకుంట్ల చంద్రశేఖర్, కిరాణ వ్యాపారి

పండ్లు పాడవుతున్నాయి 

దుమ్ము, ధూళితో రోడ్లపై పండ్లు అమ్మడం ఇబ్బందిగా మారింది. దుమ్ము కారణంగా పండ్లు త్వరగా పాడవుతున్నాయి. దీంతో గిరాకీ బాగా తగ్గింది.
- బైరోజు వెంకటమ్మ,  పండ్ల వ్యాపారి

ఊపిరితిత్తులు దెబ్బతింటాయి

 దుమ్ము, ధూళి వల్ల ఊపరితిత్తులు దెబ్బతినే ప్రమాదం ఉంది. ముఖ్యంగా అలర్జీ, వైరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫీవర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వస్తాయి. ఇప్పటికే ఊపిరితిత్తుల సమస్య ఉన్న వారికి డస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వల్ల ఆయాసం, దగ్గు వచ్చి ఆక్సిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సరిగా అందదు. రోడ్లపైన ఉండే వ్యాపారులకు సీవోపీడీ, ఐఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీ వంటి రోగాలు వచ్చి వాళ్ల ఊపిరితిత్తులు త్వరగా చెడిపోయే ప్రమాదం ఉంటుంది.
-  రాఘవేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, పల్మానాలజిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నల్గొండ