ఒకానొక సమయంలో ఓ వెలుగు వెలిగిన పూజా హెగ్డే జోరు టాలీవుడ్‌లో ఈ మధ్య బాగా తగ్గింది. బాలీవుడ్, కోలీవుడ్‌లో మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. అయితే గతేడాది ఆమె నటించిన సినిమా ఒక్కటి కూడా రిలీజ్ కాలేదు. ఈ ఏడాది మాత్రం బౌన్స్ బ్యాక్ అవుతూ వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది. ముందుగా ఆమె నటించిన హిందీ చిత్రం ‘దేవ’ రిలీజ్ కానుంది. ఇందులో బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్‌కు జోడీగా నటించింది. ఆదివారం ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. టీజర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పూజ.. ‘వెల్‌కమ్ టు దేవాస్ వరల్డ్. ఇక్కడ మాటల కంటే యాక్షనే ఎక్కువ’ అంటూ ట్వీట్ చేసింది.
తను చెప్పినట్టే.. కంప్లీట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా టీజర్‌ను కట్ చేశారు. ఇందులో షాహిద్ ఇంటెన్స్ రోల్‌లో కనిపిస్తూ ఆకట్టుకున్నాడు. మలయాళ దర్శకుడు రోషన్ ఆండ్రోస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, సిద్ధార్థ్ రాయ్ కపూర్, ఉమేష్ కేఆర్ బన్సల్ నిర్మించారు. జనవరి 31న సినిమా విడుదలవుతోంది. ఇక వరుణ్ దావన్‌తో కలిసి పూజ నటిస్తున్న మరో హిందీ మూవీ ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఈ చిత్రం కూడా ఈ ఏడాదే విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు తమిళంలో సూర్యకు జంటగా ‘రెట్రో’, విజయ్ 69వ సినిమాలో హీరోయిన్‌గా నటి స్తోంది పూజా హెగ్డే. తెలుగులో నూ కొన్ని సినిమాలకు కమిట్ అయిందని, త్వరలోనే వాటి అనౌన్స్‌మెంట్స్ వస్తాయని తెలుస్తోంది.