పదేండ్లలో పట్టించుకోలే.. రెండు నెలల్లో కంప్లీట్ 

పదేండ్లలో పట్టించుకోలే.. రెండు నెలల్లో కంప్లీట్ 
  • స్పీడ్ గా దేవాదుల స్కీమ్ టన్నెల్ పనులు
  • స్వరాష్ట్రంలో పట్టించుకోని బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ సర్కార్
  • రేవంత్‌‌‌‌ సర్కారు  రాగానే పనులపై ఫోకస్
  • టార్గెట్ లోపు ట్రయల్ రన్   చేసేందుకు ఇంజనీర్లు సిద్ధం

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు : దేవాదుల ఎత్తిపోతల పథకం ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుండెకాయ వంటిది. స్వరాష్ట్రంలోనూ పదేండ్ల బీఆర్ఎస్ పాలకులు నిర్లక్ష్యమే చేశారు.   టన్నెల్ నిర్మాణ పనులను అసలే పట్టించుకోలేదు. ఆపై పాత కాంట్రాక్ట్‌‌‌‌ సంస్థలను తప్పించారు. మేఘా సంస్థకు కట్టబెట్టినా పెండింగే​పెట్టింది.  కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ దేవాదుల పనులను చాలెంజింగ్ గా తీసుకుంది. రెండు నెలల్లో టన్నెల్‌‌‌‌ పనులు కంప్లీట్‌‌‌‌ చేయాలని ఆదేశించింది. త్వరలో టన్నెల్‌‌‌‌ పనులు పూర్తికానుండగా.. వరంగల్ ఉమ్మడి జిల్లాలో 2 లక్షల ఎకరాలకుపైగా సాగునీరు అందనుంది.  

మేఘాకు కట్టబెట్టినా పనులు పెండింగే.. 

2008లో ఉమ్మడి ఏపీలో  జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల స్కీమ్ థర్డ్‌‌‌‌ ఫేజ్‌‌‌‌ కింద రామప్ప నుంచి ధర్మసాగర్‌‌‌‌ వరకు రూ.1,410 కోట్లతో టన్నెల్‌‌‌‌ నిర్మాణం చేపట్టారు. మొదట దీన్ని 54.88 కి.మీ లు టన్నెల్‌‌‌‌  తవ్వాలని నిర్ణయించారు. టెండర్ ను హెచ్‌‌‌‌సీసీ, స్యూ, మెయిల్‌‌ ‌‌కంపెనీలు జాయింట్‌‌‌‌ వెంచర్‌‌‌‌లో దక్కించుకుని.. సబ్‌‌ ‌‌లీజ్‌‌‌‌పై కోస్టల్‌‌ ‌‌కంపెనీకి నిర్మాణ పనుల బాధ్యతను అప్పగించాయి. 2011, డిసెంబర్‌‌‌‌ 7 నాటికి పనులు పూర్తి కంప్లీట్ కావాల్సి ఉంది. కానీ, అప్పట్లో శాయంపేట మండలం చలివాగు ప్రాజెక్ట్‌‌‌‌ వద్ద బుంగపడి టన్నెల్‌‌‌‌లోకి నీళ్లు పోవడంతో ముగ్గురు కార్మికులు మృతి చెందారు.

దీంతో 50 శాతం పనులు పూర్తయ్యాక కోస్టల్ కంపెనీ చేతులెత్తేయడంతో పనులు ఆగిపోయాయి. ఆ తర్వాత స్వరాష్ట్రంలో  కేసీఆర్‌‌‌‌ సర్కార్ కోస్టల్ కంపెనీని తప్పించి.. మేఘా సంస్థకు కట్టబెట్టింది. టన్నెల్‌‌‌‌ నిర్మాణాన్ని సైతం 5.82 కి.మీ తగ్గించి, కేవలం 49.06 కి.మీ కుదించింది. కొత్తగా 3.983 కి.మీ దూరం అప్రోచ్‌‌‌‌ కెనాల్‌‌‌‌, 6.86 కి.మీ దూరం 3 మీటర్ల వ్యాసార్థం కలిగిన మూడు పైప్‌‌‌‌లైన్ల నిర్మాణం, పంప్‌‌‌‌హౌజ్‌‌‌‌, సర్జిఫూల్‌‌ ‌‌నిర్మించాలని మార్పులు చేసింది. ఎస్టిమేషన్‌‌‌‌ను కూడా రూ.84 కోట్లకు పెంచి మొత్తం వ్యయం రూ.1,494 కోట్లకు చేసింది. 

 చాలెంజ్‌‌‌‌గా తీసుకున్న రేవంత్‌‌‌‌ సర్కారు

దేవాదుల ఎత్తిపోతల స్కీమ్ లో మొత్తం 5.57 లక్షల ఎకరాలకు సాగునీరందించాల్సి ఉంది. మూడో దశలో చేపట్టిన టన్నెల్‌‌‌‌ నిర్మాణ పనులు పూర్తయితేనే ఇది సాధ్యమవుతుంది. దీన్ని గుర్తించిన రేవంత్‌‌‌‌ సర్కారు దేవాదుల ఎత్తిపోతలపై దృష్టిసారించింది. రామప్ప నుంచి ధర్మసాగర్‌‌‌‌ వరకు టన్నెల్‌‌‌‌ పనులు కంప్లీట్‌‌‌‌ చేసి ట్రయల్‌‌‌‌ రన్‌‌‌‌ నిర్వహించాలనే టార్గెట్ నిర్ణయించింది. దీన్ని ఇరిగేషన్‌‌‌‌ శాఖ కూడా ఫస్ట్‌‌‌‌  ప్రయారిటీగా తీసుకుంది. మూడు నెలల కింద హైదరాబాద్‌‌‌‌లో జరిగిన మీటింగ్‌‌‌‌లో దేవాదుల టన్నెల్‌‌‌‌ పనులను త్వరగా కంప్లీట్‌‌‌‌ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

గత నెల30న ఇరిగేషన్‌‌‌‌ మినిస్టర్‌‌‌‌ ఉత్తమ్‌‌‌‌ కుమార్‌‌‌‌ రెడ్డి కూడా గోదావరి నదిపై నిర్మించిన దేవాదుల పంప్‌‌‌‌హౌజ్‌‌‌‌ ను పరిశీలించారు. అక్కడే ఇంజినీర్లతో సమీక్ష జరిపి 2 నెలల్లో పనులు పూర్తి చేయాలని గడువు ఇచ్చారు. ఆ లోపు పనులు పూర్తికాకపోతే ఇంజినీర్లు, కాంట్రాక్ట్‌‌‌‌ సంస్థపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. 

 స్పీడ్‌‌‌‌ గా సాగుతోన్న పనులు

రామప్ప నుంచి ధర్మసాగర్‌‌‌‌ వరకు 49.06 కి.మీలు భూ అంతర్భాగంలో 6 మీటర్ల వ్యాసార్థంతో టన్నెల్‌‌‌‌ తవ్వి 5.6 మీటర్ల వెడల్పుతో 'డి' షేపులో ఉండే విధంగా సిమెంట్‌‌‌‌ లైనింగ్‌‌‌‌ పూర్తి చేశారు. ధర్మసాగర్‌‌‌‌ సమీపంలోని దేవన్నపేట వద్ద కూడా రెండు షాఫ్ట్‌‌‌‌లు నిర్మించారు. ఇందులో ఒకటి వాటర్‌‌‌‌ స్టోరేజీ కోసం, రెండోది 3 మోటార్లు ఏర్పాటు చేయడానికి సిద్ధం చేశారు. పంప్‌‌ ‌‌హౌజ్‌‌‌‌, సర్జిఫూల్‌‌, పైప్‌‌‌‌లైన్ల నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి.  కాంట్రాక్ట్‌‌‌‌ సంస్థ పనుల  స్పీడప్‌‌‌‌ లో వర్కర్ల సంఖ్యను పెంచింది. రేయింబవళ్లు మూడు షిఫ్ట్‌‌‌‌ల్లో పనులను చేయిస్తోంది.  ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా వర్క్‌‌‌‌ కంప్లీట్‌‌‌‌ చేసి ట్రయల్‌‌‌‌ రన్‌‌‌‌ నిర్వహణకు రెడీ చేస్తామని ఇంజినీర్లు చెబుతున్నారు.