వేములాడ రాజన్నకు  పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

మహాశివరాత్రి సందర్భంగా ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్నకు దేవదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించారు. అంతకుముందు ఇంద్రకరణ్ రెడ్డి దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంత‌రం కుటుంబ స‌మేతంగా స్వామివారిని ద‌ర్శించుకున్నారు. దర్శనం అనంతరం వేద‌పండితులు ఆశీర్వచనాలను అందించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రాష్ట్ర ప్రజ‌ల‌కు మ‌హాశివ‌రాత్రి శుభాకాంక్షలు తెలిపారు. స్వామి వారి దివేనలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.