ఆలయ భూములను పరిరక్షించడంలో దేవాదాయశాఖ ఫెయిల్: శ్రీకాంతేంద్ర స్వామి

ఆలయ భూములను పరిరక్షించడంలో దేవాదాయశాఖ ఫెయిల్: శ్రీకాంతేంద్ర స్వామి

బషీర్ బాగ్, వెలుగు: రాష్ట్రంలోని ఆలయ భూములను పరిరక్షించడంలో దేవాదాయశాఖ పూర్తిగా విఫలమైందని గాయత్రి మఠం పీఠాధిపతి శ్రీకాంతేంద్ర స్వామి ఆరోపించారు. భూములను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ అబిడ్స్ లోని దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఆఫీసు ముందు రాష్ట్రీయ వానర సేన ఆధ్వర్యంలో బుధవారం పలు హింధూ సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. శ్రీకాంతేంద్ర స్వామి మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుమారు 8,500 ఎకరాల ఆలయ భూములు కబ్జాకు గురయ్యాయన్నారు. దీనిపై హైకోర్టులో పిల్ వేసినా అధికారుల నుంచి స్పందన లేదన్నారు. రాష్ట్రీయ వానర సేన వర్కింగ్ ప్రెసిడెంట్ దారమోని గిరీష్, మాధవరెడ్డి, శంకరాచార్యులు, ఉమారెడ్డి, కేశవ రెడ్డి, ముఖేష్ , శివ రెడ్డి, త్రిగుణచారి, మధుకర్ రెడ్డి పాల్గొన్నారు.