
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం సాయిపేట గ్రామంలో దేవాదుల పైప్ లైన్ లీక్ అయింది. రోడ్డుపై భారీగా నీరు వృథాగా పోతోంది. ధర్మసాగర్ పంప్ హౌస్ నుంచి గండీరామారం రిజర్వాయర్లకి వెళ్లే పైప్ లైన్ విద్యుత్ సబ్ స్టేషన్ పవర్ ఫెయిల్యూర్ కావడం వల్ల మోటార్ ట్రిప్ అయింది. దీంతో పైప్ లైన్ పై లోడ్ పడి డ్యామేజ్ అయింది. పైప్ లీక్ కావవడంతో నీరంతా వృథాగా పోతోంది. అసలే నీరులేక పంటలు ఎండితున్న ఈసమయంలో నీరు వృథాగా పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వాటర్ ఫ్లో ఉవ్వెత్తున ఎగసిపడుతుండంటంతో వాహనదారులు, స్థానికులు భారీగా చూడటానికి వస్తున్నారు. ఫోటోలు,వీడియోలు తీసుకుని షేర్ చేస్తున్నారు.