16 ఏండ్లయినా పూర్తి కాని దేవాదుల ప్రాజెక్ట్

దేవాదుల కొత్త టార్గెట్ 2021

పెరుగుతున్న అంచనా వ్యయం

సర్కారు కొత్త లక్ష్యంపై ఉన్నతాధికారుల తాజా నివేదిక
ఇప్పటివరకు చేసిన ఖర్చు రూ.10 వేల కోట్లు

జయశంకర్‌‌‌‌ ‌‌‌‌భూపాలపల్లి, వెలుగు: దేవాదుల లిఫ్టు స్కీంను 2021 డిసెంబర్​31 కల్లా కంప్లీట్​ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కొత్త టార్గెట్​ పెట్టుకున్నది.  ప్రాజెక్టు ఇంజినీర్లు ఇటీవల రిలీజ్​ చేసిన రిపోర్ట్​ ద్వారా ఈ విషయం స్పష్టమైంది. గ్రావిటీ కెనాల్స్‌‌‌‌‌‌‌‌ ద్వారా 5.58 లక్షల ఆయకట్టుకు సాగునీరివ్వాలనే లక్ష్యంతో 2004లో దేవాదుల ప్రాజెక్ట్‌‌‌‌ పనులు మొదలుపెట్టారు. 16 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ కేవలం 2.34 లక్షల ఎకరాల ఆయకట్టును మాత్రమే స్థిరీకరించారు. ఇప్పటికే ప్రాజెక్ట్‌‌‌‌పై రూ.10 వేల కోట్లు ఖర్చు చేశారు. మిగిలిన 3.24 లక్షల ఎకరాలకు సాగునీరిందించే ప్రక్రియను వచ్చే ఏడాది డిసెంబర్‌‌‌‌‌‌‌‌31 నాటికి పూర్తి చేస్తామని చెబుతున్నారు.

16 ఏళ్లుగా ఆగుతూ.. సాగుతూ..

ప్రస్తుత ములుగు జిల్లాలోని కన్నాయిగూడెం మండలం గంగారం వద్ద గోదావరి నదిపై దేవాదుల లిఫ్టు స్కీం చేపట్టారు. 38.5 టీఎంసీల నీటిని  పంపింగ్​ చేయడం ద్వారా 5.58 లక్షల ఎకరాలకు సాగునీరందించాలని నిర్ణయించారు. రూ.6,016 కోట్ల అంచనా వ్యయంతో 2004లో పనులు ప్రారంభమయ్యాయి. మొదటి దశలో రూ.844 కోట్లతో ఏటూరునాగారం నుంచి ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ఘన్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌ వరకు పైప్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ నిర్మించారు. తర్వాత రూ.1,820 కోట్లతో  రెండో దశ, రూ.5,789 కోట్లతో మూడో దశ పనులు కూడా గత ప్రభుత్వాల హయాంలోనే మొదలయ్యాయి. మొదటి రెండు దశల్లోనూ కాంట్రాక్టర్లకు పనికొచ్చే ప్రధాన పైప్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ నిర్మాణ పనులే పూర్తి చేశారు. రైతులకు ఉపయోగపడే మైనర్‌‌‌‌‌‌‌‌, డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్​ నిర్మాణాలు, మూడో దశలో చేపట్టిన ఎనిమిది ప్యాకేజీల పనులు ఇంకా పూర్తికాలేదు. ఈ స్కీంకు కేంద్ర ప్రభుత్వం సైతం ఏఐబీపీ  కింద ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌ పనుల కోసం సాయం అందిస్తోంది. యేటా రాష్ట్ర ప్రభుత్వం చేసే ఖర్చులో 25 శాతం ఫండ్స్ ​సమకూరుస్తోంది.

పెరుగుతున్న అంచనా వ్యయం

టీఆర్​ఎస్​ అధికారంలోకి వచ్చాక దేవాదుల కెపాసిటీని 60 టీఎంసీలకు పెంచారు. కానీ పనుల్లో ఆలస్యం కారణంగా ఏటా అంచనా వ్యయం పెరిగిపోతోంది. 2010 నాటికి రూ.9,427.73 కోట్లకు పెరిగిన అంచనా వ్యయం, 2016 నాటికి రూ.13,445.44 కోట్లకు చేరింది.  ఈ ఏడాది ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.16 వేల కోట్లకు చేరుకోనున్నట్లు ఇంజినీర్లు చెబుతున్నారు. గడువు దాటి 14 ఏళ్లవుతున్నా ఇప్పటికీ ప్యాకేజీ 45, ప్యాకేజీ 46 పనులు పూర్తికాలేదు. రెండో దశ పనులు కూడా 2007 నాటికే పూర్తి కావాల్సి ఉండగా ఇప్పటి దాకా ఆశ్వరావుపల్లి, చీటకోడూరు డిస్ట్రిబ్యూటరీ పనులు 50 శాతం కూడా కాలేదు. మూడో దశ పనుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది.  8 ప్యాకేజీల పనులన్నీ  పెండింగ్‌‌‌‌‌‌‌‌లోనే ఉన్నాయి.

3.24 లక్షల ఎకరాల బ్యాలెన్స్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌

దేవాదుల పథకం ద్వారా ఉమ్మడి వరంగల్‌‌‌‌‌‌‌‌, నల్గొండ, కరీంనగర్‌‌‌‌‌‌‌‌, మెదక్‌‌‌‌‌‌‌‌ జిల్లాలలో కలిపి 6.21 లక్షల ఎకరాలకు సాగునీరందించాలని లక్ష్యం పెట్టుకున్నారు. వీటిలో 5.57 లక్షల ఎకరాలకు కాలువల ద్వారా, 64 వేల ఎకరాలకు చెరువుల కింద  నీరందించాలి. ఇప్పటి వరకు కేవలం 2.34 లక్షల ఎకరాల ఆయకట్టు మాత్రమే స్థిరీకరించారు. మొదటి, రెండో, మూడో దశల్లో కలిపి 17 రిజర్వాయర్లు నిర్మించాలి. ధర్మసాగర్‌‌‌‌‌‌‌‌, నర్సింగపూర్‌‌‌‌‌‌‌‌, ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ ‌‌‌‌ఘన్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌, ఆశ్వరావుపల్లి, చిటకోడూరు, గండిరామారం, బొమ్మకూరు, వెల్దండ, తపాస్‌‌‌‌‌‌‌‌పల్లి, నష్కల్‌‌‌‌‌‌‌‌, పాలకుర్తి, చెన్నూర్‌‌‌‌‌‌‌‌, నవాబ్‌‌‌‌‌‌‌‌పేట, లద్నూర్‌‌‌‌‌‌‌‌, కన్నెబోయినగూడెం, మాసిరెడ్డి చెరువు, ఐనాపూర్‌‌‌‌‌‌‌‌లను రిజర్వాయర్లుగా మార్చి కాలువల ద్వారా పంట పొలాలకు సాగునీరందించాలి. కానీ ఇప్పటికి ఇంకా 3.24 లక్షల ఎకరాల పంట పొలాలకు సాగునీరందించడానికి కాలువల నిర్మాణం కంప్లీట్​కాలేదు. ఈ క్రమంలో ఈ ఏడాది డిసెంబర్‌‌‌‌‌‌‌‌నాటికి 1,55,068 ఎకరాలు, జూన్‌‌‌‌‌‌‌‌2021 నాటికి మరో 1,28,815 ఎకరాలు, డిసెంబర్‌‌‌‌‌‌‌‌31, 2021 నాటికి మిగిలిన 40,768 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ పనులు పూర్తి చేస్తామని ప్రభుత్వం తాజా నివేదికలో పేర్కొంది. ప్రతిసారీ ఇలా పనులకు టార్గెట్​ పెట్టడం,  ఫండ్స్​లేక ఆగిపోవడం, గడువు పొడిగించడం దేవాదుల విషయంలో కామన్​గా మారిందని ఆఫీసర్లు, కాంట్రాక్టర్లు చెబుతున్నారు.

2021 డిసెంబర్‌‌‌‌‌‌‌‌ నాటికి పూర్తి చేస్తాం

దేవాదుల లిఫ్ట్​ స్కీమ్​ను 2021 డిసెంబర్‌‌‌‌‌‌‌‌ కల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మూడో దశ మూడో ప్యాకేజీ కింద చేపట్టాల్సిన సొరంగ నిర్మాణ పనులు స్పీడప్​ చేశాం. పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న అన్ని పనులనూ పూర్తి చేసి పూర్తి ఆయకట్టుకు సాగునీరందిస్తాం.

‒కె. బంగారయ్య, చీఫ్‌‌‌‌‌‌‌‌ ఇంజినీర్‌‌‌‌‌‌‌‌, దేవాదుల ఎత్తిపోతల పథకం, వరంగల్‌‌‌‌‌‌‌‌

పథకం పేరు: జె.చొక్కారావు దేవాదుల లిఫ్టు స్కీం

ప్రారంభం: 2004

మొదటి అంచనావ్యయం: 6,016 కోట్లు

ప్రస్తుత అంచనా వ్యయం: 13,445 కోట్లు

పెరిగిన అంచనా వ్యయం: 7,429 కోట్లు

ఇప్పటి వరకు చేసిన ఖర్చు: 9,944 కోట్లు

మొత్తం ఆయకట్టు: 5.58 లక్షల ఎకరాలు

ఏడాదిలో ఎత్తిపోసే గోదావరి నీటి లక్ష్యం: 60 టీఎంసీలు

For More News..

క్వాలిఫయర్లో దుమ్ములేపి ఆరోసారి ఫైనల్‌కు చేరిన ముంబై

కరోనా భయంతో కోటి జంతువులను చంపేస్తున్న డెన్మార్క్

తొమ్మిదో తరగతి స్టూడెంట్‌కు రూ.2.92 లక్షల ఫీజు