బీసీసీఐ కొత్త సెక్రటరీగా దేవజిత్ సైకియా నియమించబడ్డారు. ఆదివారం( ఫిబ్రవరి 12) జరిగిన సాధారణ సమావేశంలో జయ్ షా తర్వాత దేవజిత్ సైకియా బీసీసీఐ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా ఉన్న ఆశిష్ షెలార్ స్థానంలో బీసీసీఐ కొత్త ట్రెజరర్‌గా ప్రభ్‌తేజ్ సింగ్ భాటియాను ఎన్నుకున్నట్లు బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. తక్షణమే వీరు తమ బాధ్యతలను చేపడతారని తెలిపింది.
నిన్న జరిగిన స్పెషల్ జనరల్ మీటింగ్‌లో నిర్వహించిన ఓటింగ్‌లో వీరిద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపింది. జైషా, ఆశిష్ షెలార్ స్థానాలను భర్తీ చేస్తున్న వీరు సమర్థవంతంగా పనిచేస్తారని ఆశిస్తున్నట్లు ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ పేర్కొన్నారు. అస్సాం తరపున వికెట్ కీపర్ బ్యాటర్‌గా నాలుగు ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడి 53 పరుగులు చేసిన సైకియా గతంలో బీసీసీఐ జాయింట్ సెక్రటరీగా పని చేశారు.
ALSO READ | IPL 2025: మార్చి 21 నుంచి ఐపీఎల్ 2025.. బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ అధికారిక ప్రకటన
"నా సహోద్యోగులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఐసీసీ ఛైర్మన్, మాజీ బీసీసీఐ సెక్రటరీ జయ్ షాకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జయ్ షా స్థానంలో బాధ్యతలను చేపట్టినందుకు సంతోషంగా ఉంది. నా బాధ్యతను సమర్ధవంతంగా పోషిస్తూ ముందుకు తీసుకెళ్తాను".అని సైకియా విలేకరులతో అన్నారు.
బీసీసీఐ అఫీషియల్స్:
ప్రెసిడెంట్: రోజర్ బిన్నీ
వైస్ ప్రెసిడెంట్: రాజీవ్ శుక్లా
సెక్రటరీ: దేవజిత్ సైకియా
ట్రెజరర్: ప్రభ్‌తేజ్ సింగ్ భాటియా
ఐపీఎల్ చైర్మన్: అరుణ్ కుమార్ ధూమల్
చీఫ్ సెలక్టర్: అజిత్ అగార్కర్