Devara: ‘దేవర’ మిడ్ నైట్1 am షో క్యాన్సిల్..అరెరె.. ఈ టైంలో ఇలా చేశారేంటి..?

కూకట్పల్లిలో భ్రమరాంబ, మల్లిఖార్జున థియేటర్లు తెలియని వారుండరు. టాలీవుడ్లో పెద్ద హీరోల సినిమాలు విడుదలవుతున్నాయంటే ఈ థియేటర్ల దగ్గర ఉండే సందడి అంతాఇంతా కాదు. హైదరాబాద్లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ థియేటర్ల తర్వాత ఆ స్థాయిలో అభిమానులు సందడి చేసే థియేటర్లు ఈ రెండు. హైదరాబాద్లో బెన్ఫిట్ షోలు పక్కాగా పడే థియేటర్లలో ఈ రెండు థియేటర్లు ముందు వరుసలో ఉంటాయి. 

అలాంటి ఈ రెండు థియేటర్లలో ‘దేవర’ మిడ్ నైట్ 1 am షో క్యాన్సిల్ కావడం ఎన్టీఆర్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. కారణం ఇది అని థియేటర్ యాజమాన్యం నుంచి ఎలాంటి సమాచారం లేదు. థియేటర్ ముందు మాత్రం 1 am షో రద్దుకు సంబంధించి ఒక బోర్డ్ పెట్టేశారు. థియేటర్ యాజమాన్యానికి, దేవర సినిమా డిస్ట్రిబ్యూటర్కు మధ్య గొడవల మూలానే షో క్యాన్సిల్ చేశారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.

తెలంగాణలో మొత్తం 29 థియేటర్లలో ‘దేవర’ 1 am షోకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. కూకట్పల్లిలోని భ్రమరాంబ, మల్లిఖార్జున థియేటర్లు కూడా ఈ థియేటర్ల జాబితాలో ఉన్నాయి. దీంతో.. ఈ థియేటర్లలో మిడ్ నైట్ షో పక్కా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ భావించారు. థియేటర్ ముందు అర్థరాత్రి సెలబ్రేషన్స్ షురూ చేయడానికి సిద్ధమయ్యారు. ఇలాంటి టైంలో ‘షో క్యాన్సిల్’ అని థియేటర్ యాజమాన్యం చెప్పడంతో అభిమానుల ఆశలు ఆవిరి అయ్యాయి. 

ALSO READ : Devara First Review: డిస్ట్రిబ్యూటర్స్ దేవర ఫస్ట్ రివ్యూ ఇదే..కాకపోతే అదొక్కటే కన్‌ఫ్యూజన్!..

కూకట్పల్లి ఏరియాలో కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకుంటున్న యువత చాలా మందే ఉన్నారు. కొత్త సినిమా బెన్ఫిట్ షో పడితే థియేటర్ల దగ్గర హంగామా అంతా వీళ్లదే కనిపిస్తుంటుంది. అలాంటి కుర్రకారుకు కూకట్పల్లి మల్లిఖార్జున, భ్రమరాంబ థియేటర్లలో ‘దేవర’ 1 am షో క్యాన్సిల్ అని తెలిసి బాగా హర్ట్ అయ్యారు. కూకట్పల్లిలోని విశ్వనాథ్, అర్జున్ థియేటర్లలో కూడా ‘దేవర’ 1 am షోకు అనుమతి ఉంది. ఈ థియేటర్లలోనైనా మిడ్ నైట్ షో పడితే కూకట్పల్లిలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొంత శాంతించే అవకాశం ఉంటుంది.

భ్రమరాంబ, మల్లిఖార్జున థియేటర్లు నందమూరి కుటుంబానికి సొంత థియేటర్ల లాంటివి. బాలయ్య సినిమా బెన్ఫిట్ షో పడిందంటే ఆయన స్వయంగా వెళ్లి మరీ సినిమాను వీక్షించే థియేటర్లు ఇవి. నందమూరి హీరోల సినిమాలకు ఈ థియేటర్ల ముందు ఫ్యాన్స్ చేసే సెలబ్రేషన్స్ మాములుగా ఉండవు. బాలయ్య, ఎన్టీఆర్ సినిమాలు విడుదలైన ప్రతీ సందర్భంలో ఈ రెండు థియేటర్ల ముందు పెద్ద పండగ వాతావరణమే కనిపిస్తుంటుంది. అలాంటి థియేటర్లలో ‘దేవర’ బెన్ఫిట్ షో పడే పరిస్థితి లేకపోవడం ఎన్టీఆర్ అభిమానులను నిరాశకు గురిచేసిన విషయం.