దేవర మొదటివారం కలెక్షన్లు ఎంతంటే..?

దేవర మొదటివారం కలెక్షన్లు ఎంతంటే..?

సెప్టెంబర్ 27న యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన దేవర చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ ప్రేక్షకులముందుకు వచ్చింది.అనుకున్నవిధంగానే దేవర చిత్రం అభిమానుల అంచనాలను ఏమాత్రం మిస్ అవ్వకుండా మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. 

అయితే దేవర చిత్రంలో ఎన్టీఆర్ మాస్ డైలాగ్స్ & యాక్టింగ్, సైఫ్ అలీఖాన్ విలనిజం, యాక్షన్ సీన్స్, ఫాదర్ సెంటిమెంట్ ఇలా అన్ని కలిపి ఫుల్ ప్యాక్ ఎంటర్టైన్మెంట్ అందించారు. దీంతో రిలీజ్ అయిన మొదటిరోజే రూ.173 కోట్లు (గ్రాస్) భారీ ఓపెనింగ్స్ సాధించింది.

అయితే ఇటీవలే దేవర చిత్ర మొదటివారం కలెక్షన్ వివరాలని చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఇందులో భాగంగా మొదటివారం దేవర చిత్రం  ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా రూ.405 కోట్లు (గ్రాస్) వసూళ్లు సాధించినట్లు ప్రకటించారు. దీంతో తారక్ కెరీర్ లో ఇప్పటివరకూ సోలో పెర్ఫెర్మెన్స్ తో వచ్చిన సినిమాల్లో హైయెస్ట్ వసూళ్లు సాధించిన చిత్రంగా దేవర రికార్డులు క్రియేట్ చేసింది.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం దసరా సెలవులు కావడం, అలాగే దసరా ముంగిట పెద్ద చిత్రాలు లేకపోవడంతో ఈ వారాంతంలో  దేవర చిత్రం కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో రూ.600 కోట్లు (గ్రాస్) కలెక్ట్ చేయనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.