ఇటీవలే టాలీవుడ్ ప్రముఖ హీరో ఎన్టీఆర్ మరియు డాషింగ్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవర చిత్రం ట్రైలర్ విడుదలయిన సంగతి అందరికి తెలిసందే. అయితే ఈ ట్రైలర్ కి ఆడియన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది. అలాగే దేవర చిత్ర ట్రైలర్ విడుదల చేసిన ఒక్క రోజులోనే దాదాపుగా 55 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.
అయితే దేవర చిత్ర ట్రైలర్ విడుదలయిన తర్వాత ఈ చిత్రం రన్ టైం గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. దేవర చిత్రం మొదటి భాగం రన్ టైం దాదాపుగా 2 గంటల 58 నిముషాలు ఉండనున్నట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.
Also Read :- దేవర చిత్రంలో నటించిన తర్వాత అలాంటి అనుభూతి కలిగింది
కాగా గతంలో ఇలా రెండు భాగాలుగా విడుదలైన చిత్రాలు పుష్ప - ది రైస్ (2.59 గం.నిముషాలు), సలార్ (2.55 గం.నిముషాలు) , కేజీఎఫ్ (2.35 గం.నిముషాలు) దాదాపుగా రెండున్నర గంటలకంటే ఎక్కువ నిడివి కలిగి ఉన్నాయి. దీంతో దేవర చిత్రం మొదటి భాగం కూడా దాదాపుగా రెండున్నర గంటలకంటే ఎక్కువగా ఉండబోతున్నట్లు సమాచారం. కాగా దేవర చిత్రానికి CBFC ప్యానెల్ UA సర్టిఫికేట్‌తో చిత్రానికి క్లియర్ చేసింది.