యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) హీరోగా నటిస్తోన్న30వ చిత్రం 'దేవర' (Devara) షూటింగ్ శర వేగంగా సాగుతోంది. ప్రస్తుతం గోవా అందాల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు మేకర్స్. ఇందులో తారక్..జాన్వీ సహాకీలక నటులంతా పాల్గొంటున్నారు.
లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి మరో కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇంకో 5 నెలల్లో థియేటర్లోకి రానున్నట్లు తెలిపే ఈ పోస్టర్ లో..నడి సముద్రాన ఎన్టీఆర్ చేతిలో ఆయుధం..తీరాన్ని ముద్దాడే పడవ ను చూపించారు.అలాగే..'భయానికి కొత్త పేరు ఉంటే అదే దేవర. మరో 150 రోజుల్లో విధ్వంసాన్ని థియేటర్లో చూసేందుకు సిద్ధంగా ఉండండి..అంటూ పోస్ట్ చేశారు. ఈ స్పెషల్ పోస్టర్ ఎన్టీఆర్ అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది.
Fear has a new name, and it's #Devara ?.
— Devara (@DevaraMovie) November 7, 2023
Get ready to witness the most MASSIVE SHOW on the Big Screens in 150 days!
Counting down towards the #DevaraFrenzy. ? pic.twitter.com/CafxwMJsLN
ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది 2024 ఏప్రిల్5న రిలీజ్ చేయనున్నారు.