Devara OTT: అఫీషియల్.. దేవర ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Devara OTT: అఫీషియల్.. దేవర ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) నటించిన దేవర (Devara) మూవీ రిలీజైన 40 రోజుల తర్వాత ఓటీటీలోకి అడుగుపెడుతోంది. శుక్రవారం (నవంబర్ 8న) నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కి సిద్దమైంది. బాక్సాఫీస్ దగ్గర రూ.500 కోట్లకుపైగా వసూలు చేసిన ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ పై మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారు.

దేవర ఓటీటీ

300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన దేవర మూవీ ఈ శుక్రవారం (నవంబర్ 8) నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్బంగా మేకర్స్ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించారు. "అపుడపుడు ధైర్యానికి తెలిదు అవసరానికి మించి తను ఉండకూడదు అని... అప్పుడు భయానికి తెలియాలి, తను రావాల్సిన సమయం వచ్చింది అని. ఒస్తున్నాడు శుక్రవారం (నవంబర్ 8న) తెలుగు, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో.. దేవర స్ట్రీమింగ్ కి సిద్ధం.. అలాగే హిందీలో త్వరలో రానుంది" అంటూ నెట్ఫ్లిక్స్ వెల్లడించింది. 

అయితే.. దేవర డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం ఎన్నో ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పోటీపడగా చివరికి నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. దాదాపు రూ. 155 కోట్లు వెచ్చించి దేవర డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసిందని సమాచారం.కాగా ఎన్టీఆర్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన సోలో మూవీగా దేవర రికార్డు క్రియేట్ చేసింది తెలిసిందే. 

కథేంటంటే::

దేవర మూవీ కథ 1996లో మొదలయ్యి సింగప్ప (ప్రకాష్ రాజ్) ఒక పోలీసాఫీసర్ శివం (అజయ్)కి ఫ్లాష్బ్యాక్ చెప్పడంతో ప్రారంభం అవుతోంది. నిఘా వర్గాల హెచ్చరికలతో 1996లో యతి అనే ఒక గ్యాంగ్ స్టార్ను పట్టుకునేందుకు శివం ఏపీ తమిళ నాడు బోర్డర్లో ఉన్న రత్నగిరి వెళ్తాడు. కథ వివరాల్లోకి వెళితే.. 

ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు సరిహద్దు రత్నగిరి ప్రాంతమది. సముద్రానికి ఆనుకుని ఉన్న ఓ కొండ‌పై నాలుగు ఊర్ల‌ని క‌లిపి 'ఎర్ర స‌ముద్రం' అని పిలుస్తుంటారు. ఆ పేరు వెన‌క బ్రిటిష్ కాలం నుంచి చ‌రిత్ర ఉంటుంది. అక్కడ దేవర (ఎన్టీఆర్) తో పాటు భైరవ ( సైఫ్ అలీ ఖాన్), రాయప్ప ( శ్రీకాంత్) , కుంజర(షైన్‌ టామ్‌ చాకో) ఒక్కో గ్రామ పెద్దగా ఉంటారు. ఆ నాలుగు ఊళ్ళ వాళ్లకు సముద్రమే జీవనాధారం. ఆ సముద్రం ద్వారా కొన్ని సరుకులు కోస్ట్ గార్డ్‌కు తెలియకుండా దించుతుంటారు. అలా తన వాళ్ల కోసం ఎంతవరకు అయిన వెళ్లి, ప్రాణాలు ఇచ్చేంత ధైర్యం దేవరకు ఉంటుంది. అదే ఊళ్ళో ఉన్న భైరాకు దేవర చేసే పనులు ఏ మాత్రం నచ్చవు. కానీ దేవర సాయం లేకుండా ఏం చేయలేం అని భైరాకు తెలుసు. అందుకే అదును కోసం చూస్తుంటాడు.

దేవర తన వారైన రాయప్ప, భైరా, కుంజ, కోర తో కలిసి పెద్ద పెద్ద షిప్స్ నుంచి మురుగా (మురళి శర్మ) కోసం దొంగతనాలు చేస్తూ ఉంటాడు. అలాంటి దేవర ఒక దొంగతనం చేస్తున్న సమయంలో మనసు మార్చుకుని ఇక దొంగతనం చేయకూడదని ఫిక్స్ అవుతాడు. 

Also Read :- గేమ్ ఛేంజర్ టీజర్ లాంచ్ ఈవెంట్ ఎక్కడంటే.. 

ఇలా ఓ సమయంలో సంద్రానికే ఎదురెళ్లి ఒడ్డుకు చేరుస్తున్న ఆ ఆయుధాలు త‌మ‌కే ముప్పు తీసుకొస్తున్నాయ‌ని గ్ర‌హించిన దేవ‌ర‌...తాము చేసేది తప్పు అని.. తన వాళ్లను కూడా సముద్రం పైకి వెళ్లొద్దని హెచ్చరిస్తాడు. ఇక‌పై ఆ పనుల్ని చేయకూడ‌ద‌నే నిర్ణ‌యానికొస్తాడు. బత‌క‌డానికి ఎన్నో మార్గాలున్నాయ‌ని, చేప‌లు ప‌ట్ట‌డంపై దృష్టి పెడ‌దామ‌ని చెబుతాడు. కానీ భైర‌ అందుకు ఏ మాత్రం ఒప్పుకోడు. దాంతో దేవర, బైరా మ‌ధ్య మనస్పర్థలు మొదలవుతాయి. ఇక బైరా అప్పట్నుంచి వరుసగా  ఎత్తులు వేయడం మొదలెడతాడు. ఏం చేసి అయిన దేవరని చంపేయాలని  భైరవ ప్లాన్ వేస్తాడు.

ఈ క్రమంలో దేవర మాటను కాదని భైరవతో పాటు డబ్బులకు అలవాటు పడ్డ ఆ గ్రామ ప్రజలు సముద్రం ఎక్కేందుకు సిద్ధం అవ్వగా...దేవర వాళ్లకి తీవ్రమైన భయాన్ని చూపిస్తాడు. ఆ భయం దెబ్బకు వాళ్ళు మళ్లీ తప్పుడు పని కోసం సముద్రం ఎక్కాలి అంటేనే భయపడతారు. అంతలా భయపెట్టేందుకు దేవర ఒక కీలక నిర్ణయం తీసుకుంటాడు. ఆ కీలక నిర్ణయం ఏమిటి? అలా కొన్నేళ్ల తర్వాత ఊరికి దూరంగా అజ్ఞాతంలోకి దేవర ఎందుకు వెళ్లాల్సి వచ్చింది?

అతని కొడుకు వర (ఎన్టీఆర్) ఎందుకు భయస్తుడుగా మారాడు? అటువంటి వరని అంతలా ఇష్టపడుతున్న తంగం (జాన్వీ కపూర్) ఎవరు? దేవర, భైరాల గొడవ చివరికి ఏ పరిస్థితులకి దారి తీస్తుంది. అందులో వర పాత్ర ఏమౌతుంది? చివరికి పోలీసాఫీసర్ శివంకి యతి అనే గ్యాంగ్ స్టార్ దొరికాడా? లేదా? అనే తదితర విషయాలు తెలియాలంటే థియేటర్లో సినిమా చూడని వాళ్ళు ఓటీటీలో చూసి తెలుసుకోవాల్సిందే.