Devara First Review: డిస్ట్రిబ్యూటర్స్ దేవర ఫస్ట్ రివ్యూ ఇదే..కాకపోతే అదొక్కటే కన్‌ఫ్యూజన్!..

టాలీవుడ్ సినీ చరిత్రలో అపజయం లేని డైరెక్టర్గా చెరగని ముద్ర వేశారు దర్శక ధీరుడు రాజమౌళి. ఆయన దర్శకత్వంలో నటించిన హీరోలు తమ స్టార్ డమ్ ను అమాంతం పెంచేసుకున్నారు. ఉదాహరణకు వాళ్లలో ప్రభాస్ ఒకరు. టాప్ 10 ఇండియన్ టాప్ 5లో అతని సినిమాలు ఉండడం విశేషం. 

అయితే.. డైరెక్టర్ రాజమౌళితో సినిమా చేసిన హీరోకు ఆ తర్వాతి మూవీ ప్లాప్ తీసుకొస్తుందన్న ఈ బ్యాడ్ సెంటిమెంట్..ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న విషయం తెలిసిందే. అందుకు కారణం లేకపోలేదు..ఇదివరకు రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్ హీరోగా చేసిన సింహాద్రి మూవీ తర్వాత వచ్చిన ఆంధ్రావాలా భారీ డిజాస్టర్ అందుకుంది. అంతేకాదు..కాస్తా వెనుకకి వెళితే.. 

ALSO READ | DevaraJatharaaBegins: దేవర '1 am' షోలు ఈ 29 థియేటర్లలోనే.. అవేంటో ఓ లుక్కేయండి

స్టూడెంట్ నెంబర్ 1 మూవీ తర్వాత ఎన్టీఆర్ చేసిన సుబ్బు ప్లాప్ గా నిలిచింది. సింహాద్రి తర్వాత ఆంధ్రావాలా ప్లాప్, నితిన్ సై తర్వాత అల్లరి బుల్లోడు ప్లాప్, ప్రభాస్ ఛత్రపతి తర్వాత అడవి రాముడు, విక్రమార్కుడు తరువాత ఖతర్నాక్, యమదొంగ తర్వాత కంత్రి, మగధీర తర్వాత ఆరెంజ్, మర్యాదరామన్న తర్వాత అప్పలరాజు సినిమా ప్లాప్, ఈగ తరువాత ఎటో వెళ్ళిపోయింది మనసు ప్లాప్, బాహుబలి 1,2 తర్వాత ప్రభాస్ సాహో ప్లాప్.. ఇలా రాజమౌళితో సినిమా చేశాక ప్లాప్ సినిమా చేయడం హీరోలకు సెంటిమెంట్ గా మారింది. ఇదే ప్రశ్నను రాజమౌళి ఎన్నోసార్లు..కాదు..కాదు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్నాడు. ఆ వెంటనే సమాధానం ఇస్తున్న కానీ, ఆ ప్రశ్న మళ్ళీ ఎదురువుతూ వస్తోంది. 

అలాగే, ఆచార్య వంటి ప్లాప్ తర్వాత కొరటాల శివ దర్శకత్వం వహించిన సినిమా దేవర. ఇలాంటి అంశాలతో దేవరపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ దేవరతో గ్రాండ్ సక్సెస్ ఇస్తే..రాజమౌళిపై ఉన్న ఈ హీరోల ఫెయిల్యూర్స్ ముద్ర పటాపంచల్ కావడం కన్ఫమ్. 

డిస్ట్రిబ్యూటర్స్ ఫస్ట్ రివ్యూ::

ఇకపోతే..రెండు రోజుల ముందుగానే దేవర మూవీని చూసిన ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫస్ట్ రివ్యూ ఇచ్చేసారు. దేవర ఫస్టాఫ్ బాగుందని..అలాగే  సినిమా యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయని.. 40 నిమిషాల క్లైమాక్స్ సీన్స్ గూస్బంప్స్ అని చెబుతున్నారు. దేవర సినిమా రివర్స్ స్క్రీన్ ప్లేతో సాగుతుందట. ఇదే ఆడియన్స్ ను తికమక పెట్టె ఛాన్స్ ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అలాగే, అనిరుధ్ రవించదర్ అందించిన బీజీఎమ్ బాగుందని ,కొరటాల శివ ఆచార్య సినిమా కంటే బెటర్‌గా అభిమానులను ఆకట్టుకునే అంశాలు దేవరలో చాలా ఉన్నాయని టాక్. 'సైఫ్ అలీ ఖాన్ ఫెంటాస్టిక్.. జాన్వీ కపూర్ ఇరిటేటింగ్. బిగ్ స్క్రీన్‌లో చూసేవారికి దేవర పైసా వసూల్ ఎంటర్టైనర్" అని క్రిటిక్‌గా చెప్పుకునే ఉమర్ సంధు రివ్యూ ఇచ్చారు.

  • Beta
Beta feature