దేవరకు అరుదైన ఘనత

దేవరకు  అరుదైన ఘనత

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో  రూపొందుతున్న  హై ఓల్టేజ్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్   ‘దేవర’. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్ నుంచి రాబోతోన్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.   రెండు భాగాలుగా తెరకెక్కుతున్న  ఈ మూవీ ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో హాలీవుడ్‌‌‌‌లో జరగనున్న ‘బియాండ్ ఫెస్ట్‌‌‌‌’లో  ‘దేవ‌‌‌‌ర’ చిత్రాన్ని  ప్రదర్శించనున్నారు.  కాలిఫోర్నియాలోని లాస్‌‌‌‌ ఏంజెలిస్‌‌‌‌లో జరగనున్న అతిపెద్ద ఫిల్మ్ ఫెస్టివల్‌‌‌‌లో సెప్టెంబ‌‌‌‌ర్ 26న సాయంత్రం ఆరున్నర గంట‌‌‌‌ల‌‌‌‌కు ఈజిప్షియన్ థియేటర్‌‌‌‌లో ఈ చిత్రాన్ని ప్రద‌‌‌‌ర్శించ‌‌‌‌నున్నారు.  మూవీ టీమ్‌‌‌‌తో పాటు హాలీవుడ్‌‌‌‌కు చెందిన‌‌‌‌ సినీ ప్రముఖులు ఈ ప్రీమియర్‌‌‌‌‌‌‌‌ షోకు హాజ‌‌‌‌రు కాబోతున్నారు. 

అక్కడ ప్రీమియ‌‌‌‌ర్ కాబోతున్న తొలి ఇండియన్ సినిమాగా ‘దేవ‌‌‌‌ర’ అరుదైన ఘ‌‌‌‌న‌‌‌‌త‌‌‌‌ను సొంతం చేసుకుంటుంది.  మరోవైపు ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.  నాలుగు సన్నివేశాల్లో మార్పులు సూచించిన సెన్సార్ బోర్డ్, యు/ఎ సర్టిఫికెట్ జారీ చేసింది.   సినిమా రన్ టైమ్ 2 గంటల 58  నిమిషాలు.  సైఫ్ అలీఖాన్ విలన్‌‌‌‌గా నటిస్తుండగా జాన్వీ కపూర్ టాలీవుడ్  ఎంట్రీ ఇస్తోంది.   అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. కళ్యాణ్ రామ్ సమర్పణలో సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.