యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) లేటెస్ట్ మాస్ ఎంటర్టైనర్ దేవర (Devara) రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. స్టార్ డైరెక్టర్ శివ కొరటాల (Shiva Koratala) పాన్ ఇండియాలో స్థాయిలో తెరకెక్కించి సక్సెస్ అయ్యాడు.
ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఆరు రోజులకు గాను రూ.396 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించి దసరా ఫెస్టివల్ బరిలో నిలిచింది. ఐతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఓ భారీ షాక్ ఇచ్చారు దేవర మేకర్స్. ఓ భారీ సక్సెస్ ఈవెంట్ను నిర్వహించబోతున్నట్లు వార్తలు వచ్చిన.. అది సాధ్యమవ్వలేదు అంటూ మేకర్స్ ప్రకటించి షాక్ ఇచ్చారు.
ఈ క్రమంలో నిర్మాత నాగ వంశీ ట్వీట్ చేస్తూ.. "దేవర బాక్సాఫీస్ వద్ద అపూర్వమైన రికార్డులను నెలకొల్పడంలో భాగస్వామ్యమైన మీలో ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మీరు (అభిమానులు) కోరుకున్నట్లు ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించలేకపోయినందున క్షమాపణలు కోరుతున్నాము. మేము ఎడతెగని ప్రయత్నాలు చేసినప్పటికీ, దసరా మరియు దేవీ నవరాత్రి ఉత్సవాల కారణంగా, మా భారీ విజయోత్సవ వేడుకల కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో బహిరంగ వేదికలకు అనుమతులు పొందలేకపోయాము!!!
Also Read :- బిగ్బాస్ లోకి వైల్డ్కార్డ్ ఎంట్రీస్లో గంగవ్వతో పాటు మరో ఏడుగురు వీళ్లే!
ఈ పరిస్థితి మా నియంత్రణలో లేదు మరియు ఈ ఈవెంట్‌ను నిర్వహించలేకపోయినందుకు అభిమానులందరికీ మరియు మా ప్రేక్షకులకు మేము హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాము. అయినప్పటికీ, మేము ఇంకా ప్రయత్నిస్తున్నాము. ఎందుకంటే తారక్ అన్న తెలుగు రాష్ట్రాల్లోని తన అభిమానులతో దేవర విజయాన్ని ఘనంగా జరుపుకోవడానికి ఒక ఈవెంట్‌ను నిర్వహించాలని మొండిగా ఉన్నాడు. ఇక తారక్ అన్నను కొత్త శిఖరాలకు తీసుకెళ్లే శక్తిగా మీరు అర్థం చేసుకుని, కొనసాగుతారని ఆశిస్తున్నాము.." అని ప్రొడ్యూసర్ నాగ వంశీ ట్విట్టర్ X ద్వారా పోస్ట్ చేశాడు.
A big thank you to each and every one of you who played a part in creating the #DevaraStorm and setting unprecedented records at the BOX OFFICE.
— Naga Vamsi (@vamsi84) October 3, 2024
Since the pre-release event couldn’t be held, Tarak anna was adamant about having an event to CELEBRATE the Success of Devara in a BIG… pic.twitter.com/kyxAhy3CnN
అయితే, ఈ గ్రాండ్ ఈవెంట్ ను బుధవారం అక్టోబరు 2న నిర్వహించాలనే ఆలోచనలో ఉన్న మేకర్స్ కి పర్మిషన్ రాకపోవడంతో ఈ తాజా విషయం వెల్లడించారు మేకర్స్.