మూడో పాటకు ముహూర్తం ఫిక్స్

ఇప్పటికే రెండు పాటలతో ఇంప్రెస్ చేసిన ‘దేవర’ టీమ్, మూడో పాట విడుదలకు ముహూర్తం ఖరారు చేసింది. సెప్టెంబర్ 4న ఈ పాటను విడుదల చేయబోతున్నట్టు సోమవారం ప్రకటించారు. ‘‘దావుడి’ అంటూ సాగే పాట కచ్చితంగా అదిరిపోతుంది, ప్రతీ బీట్ విజిల్ వేసేలా ఉంటుంది’ అంటూ ఓ పోస్టర్‌‌‌‌‌‌‌‌ని మేకర్స్‌‌‌‌ విడుదల చేశారు.  

ఇదొక రొమాంటిక్ డ్యూయెట్‌‌‌‌ అని ఈ పోస్టర్ ద్వారా అర్థమవుతోంది. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. జాన్వీకపూర్ హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది. సైఫ్ అలీఖాన్ విలన్‌‌‌‌గా నటిస్తున్నాడు.  ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. సెప్టెంబర్​ 27న సినిమా విడుదల కానుంది.