దేవర ట్రైలర్ టైమ్ ఆగయా

దేవర ట్రైలర్ టైమ్ ఆగయా

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో  తెరకెక్కుతోన్న  హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్   ‘దేవర’. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 27న వరల్డ్‌‌‌‌‌‌‌‌వైడ్‌‌‌‌‌‌‌‌గా విడుదల కానుంది. ఇప్పటికే పాటలతో ఆకట్టుకున్న టీమ్.. తాజాగా ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మూహూర్తం ఫిక్స్ చేశారు.  మంగళవారం ఈ మూవీ ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. 

ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎన్టీఆర్.. ఓ రాయిపై నిలబడి చేతిలో గొడ్డలి పట్టుకుని ఇంటెన్స్ లుక్‌‌‌‌‌‌‌‌లో ఇంప్రెస్ చేస్తున్నాడు.  హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్న జాన్వీ కపూర్ ఈ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. సైఫ్ అలీఖాన్ విలన్‌‌‌‌‌‌‌‌గా కనిపించనున్నాడు.  ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.  కళ్యాణ్ రామ్ సమర్పణలో సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.