
ఏపీ కర్నూలు జిల్లాలోని దేవరగట్టు మరోసారి కర్రల సమరం జరిగింది. హొళగుంద మండలం దేవరగట్టు మాళ మల్లేశ్వరస్వామి దసరా బన్ని జైత్రయాత్ర అర్ధరాత్రి మొదలైంది. ఉత్సవంలో చెలరేగిన హింసలో వంద మందికి పైగా గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆదోనిలోని ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు.
దేవరగట్టులో 800 అడుగుల ఎత్తైన కొండపై మాళ మల్లేశ్వరస్వామి దసరా రోజు జరిగే బన్ని ఉత్సవానికి ప్రత్యేకత ఉంది. ఉత్సవాల సందర్భంగా స్వామి మూర్తులను దక్కించుకోవడానికి నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామాల భక్తులు ఓ వైపు.... అరికెర, అరికెరతండా, సుళువాయి, ఎల్లార్తి, కురుకుంద, బిలేహాల్, విరుపాపురం తదితర గ్రామాల భక్తులు మరోవైపు కర్రలతో కొట్టుకుంటారు.