కొత్తకోట, వెలుగు : ప్రభుత్వం ఉచితంగా అందజేసిన చేప పిల్లలను దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి శుక్రవారం మృత్స్యకారులతో కలిసి శంకర సముద్రంలో విడిచి పెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మృత్య్సకారులు అడగకపోయినా ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. మృత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలని సీఎం ఈ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు.
2.40 లక్షల చేప పిల్లలను మత్స్యకారులకు పంపిణీ చేసి శంకర సముద్రంలో వదలడం ఆనందంగా ఉందన్నారు. భారీ వర్షాల కారణంగా చేప పిల్లల పంపిణీ ఆలస్యమైందని చెప్పారు. మార్కెట్ చైర్మెన్ పల్లెపాగ ప్రశాంత్, వేముల శ్రీనివాస్ రెడ్డి, బీచుపల్లి యాదవ్, శ్రీను, రావుల సురేంద్రనాథ్‌రెడ్డి, రావుల జితేందర్ రెడ్డి, చీర్ల రాము, ఎల్లంపల్లి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.