హరీశ్ రావు రాజీనామాకు సిద్ధం కావాలి : ఎమ్మెల్యే బాలూనాయక్  

దేవరకొండ(కొండమల్లేపల్లి), వెలుగు : బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధం కావాలని ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ అన్నారు. శనివారం కొండమల్లేపల్లి మండల కేంద్రంలో ఎంపీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగవుతుందన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే ఐదు పూర్తి చేశామని, ఇచ్చిన హామీలన్నీ త్వరలో పూర్తిచేస్తామని తెలిపారు.

కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం కొండమల్లేపల్లి మండల పరిధిలోని చిన్నఆడిశర్లపల్లి, చింతకుంట గ్రామాలకు చెందిన సుమారు 100 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు. పార్టీలో చేరిన వారికి కండువా కప్పి ఆహ్వానించారు. అంతకుముందు నూతన ప్రెస్ కమిటీ అధ్యక్షుడు ఏరుకొండ రామును శాలువాతో సత్కరించారు.

కార్యక్రమంలో ఎంపీపీ దూదిపాల రేఖాశ్రీధర్ రెడ్డి, జడ్పీటీసీ సలహాదారు పసునూరి యుగేందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ కాసర్ల వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షుడు ఊట్కూరు వేమన్ రెడ్డి, మాజీ సర్పంచ్ కుంభం శ్రీనివాస్ గౌడ్, మాజీ ఉప సర్పంచ్ గంధం సురేశ్, ఎంపీటీసీ సుమలత భాస్కర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.