దేవరకొండ, కొండమల్లేపల్లి, వెలుగు : బీజేపీకి ఓటు వేస్తే రిజర్వేషన్ల రద్దు తథ్యమని దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ అన్నారు. బుధవారం కొండమల్లేపల్లి మండలంలోని వర్ధమానిగూడెం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ ముఖ్య నాయకులు మంత్తు, శ్రీను, రాములు, సురేశ్, కిషన్ తో పాటు100 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
బీజేపీ, బీఆర్ఎస్ కుట్రల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి దేశాన్ని కాపాడుకోవాలన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత తొలిసారి దేవరకొండకు విచ్చేసిన గుత్తా జితేందర్ రెడ్డి, గుత్తా అమిత్ రెడ్డితో ప్రస్తుత రాజకీయాలపై ఆయన చర్చించారు.