యువత క్రీడల్లో రాణించాలి : ఎమ్మెల్యే బాలూనాయక్

దేవరకొండ(కొండమల్లేపల్లి), వెలుగు : యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ సూచించారు. సోమవారం కొండమల్లేపల్లి పట్టణంలోని తహసీల్దార్​ కార్యాలయం వద్ద  క్రీడా ప్రాంగణంలో మైనార్టీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలు శారీరక, మానసిక దృఢత్వానికి దోహద పడతాయన్నారు. క్రీడాకారులను తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, ప్రతిభావంతులైన క్రీడాకారులకు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఉంటాయని తెలిపారు. 

అనంతరం ఎమ్మెల్యేను మైనార్టీ అసోసియేషన్ సభ్యులు  గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ దూదిపాల రేఖాశ్రీధర్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దూదిపాల వేణుధర్ రెడ్డి, పార్లమెంటరీ కో–ఆర్డినేటర్ ఎంఏ సిరాజ్ ఖాన్, ఊట్కూరి వేమన్ రెడ్డి, వైస్ ఎంపీపీ కాసర్ల వెంకటేశ్వర్లు, పవన్ కుమార్, ఎంఏ కైసర్ ఖాన్, శ్రీనివాస్ గౌడ్, గంధం సురేశ్, జమాల్, జానీ, హబీబ్, ఇలియాస్, నదీమ్, సయ్యద్ తదితరులు పాల్గొన్నారు.