నేపాల్ దేశం అల్లకల్లోలంగా మారింది. 48 గంటల ఆగకుండా పడిన కుండపోవత వర్షంతో ఆ దేశాన్ని వరదలు ముంచెత్తాయి. ఎంతలా అంటే.. వేల సంఖ్యలో ఇల్లు కొట్టుకుపోయాయి. పర్వతాలు, లోయల మధ్యలో ఉండే నేపాల్ దేశంలోని చాలా ప్రాంతాలు ఇప్పుడు బురదలో కూరుకుపోయాయి. 50 మంది చనిపోయినట్లు అధికారికంగా ప్రకటించినా.. ఆ సంఖ్య ఇంకా చాలా ఉండొచ్చని భావిస్తున్నారు. 5 వేల మంది సిబ్బందితో పాటు హెలికాప్టర్లతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది.
నేపాల్ దేశంలోని ఖాట్మాండ్, లతిత్ పూర్, భక్తపూర్, కవ్రే, సింధుపాల్ చౌక్, పంచతార్, ధనకూట, సింధులి, జూపా, ధాడింగ్ వంటి ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. మొత్తం 44 జిల్లాల్లో వరదలు వచ్చాయి. కొండ చరియలు విరిగిపడ్డాయి. 39 జిల్లాల మధ్య రోడ్లు తెగిపోయాయి. రాకపోకలు బంద్ అయ్యాయి. ఇప్పటికే 13 వందల కాంక్రీట్ ఇళ్లు కొట్టుకుపోయినట్లు అధికారికంగా ప్రకటించగా.. మరికొన్ని వేల సంఖ్యలో ఇల్లు నేలమట్టం అయినట్లు వార్తలు వస్తున్నాయి.
ALSO READ | తమిళనాడులో భారీ అగ్ని ప్రమాదం... బాణాసంచా గోడౌన్ లో చెలరేగిన మంటలు....
నేపాల్ దేశంలోని మొత్తం 77 జిల్లాల్లో.. 56 జిల్లాలు భారీ వర్షాలు, వరదలకు ఎఫెక్ట్ అయ్యాయి. దేశవ్యాప్తంగా విమాన సర్వీసులు రద్దు చేశారు. రైళ్లు, బస్సు రాకపోకలతోపాటు రవాణా వ్యవస్థ స్తంభించింది. లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు. కమ్యునికేషన్ వ్యవస్థ దెబ్బతిన్నది. సెప్టెంబర్ 26వ తేదీన మొదలైన వర్షాలు.. రెండు రోజులు కుండపోతగా పడ్డాయి. దీంతో నదులు అన్నీ పొంగిపొర్లుతున్నాయి. కొండ ప్రాంతాల్లోని ఇల్లు బురదలో కూరుకుపోయాయి. అక్కడి వారిని రక్షించేందుకు హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నారు అధికారులు.
हेलीकप्टर बाट उद्दार हुदै - नख्खु , ललीतपुर l pic.twitter.com/P6yMWEC8de
— Ashish Gajurel (@ashish_gajurel) September 28, 2024