![దేవమ్మ.. అంటూ ఫొటోలు దిగుతరు](https://static.v6velugu.com/uploads/2022/02/devatha-serial-child-artist-devamma-interview-with-v6-news_eRSTJuBltZ.jpg)
ఈ చిన్నారి వయసు కేవలం తొమ్మిదేండ్లు. కానీ, ఇప్పటికే బోలెడు సినిమాల్లో యాక్ట్ చేస్తోంది. సీరియల్స్‌లోనూ నటిస్తోంది. తన మార్క్ యాక్టింగ్‌తో ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న ఈ లిటిల్ స్టార్ అసలు పేరు అహానా. ఇంత చిన్న వయసులో పేజీల పేజీల డైలాగులు ఎలా గుర్తు పెట్టుకుంటావ్? రోజుల తరబడి షూటింగ్ ఇబ్బంది అనిపించదా? అని అడిగితే.. ‘‘నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. అందుకే కష్టమనిపించవు అంటోంది.
నీ పూర్తి పేరేంటి?
నా అసలు పేరు పానుగోతు అహానా. కానీ, ఇంట్లో అందరూ నన్ను బర్ఫీ అంటారు. ఎందుకలా పిలు స్తారని అమ్మని అడిగితే.. ‘నువ్వు పుట్టినప్పుడు నాలుగున్నర కేజీలు ఉన్నావ్. అందుకే ‘బర్ఫీ’ అనే నిక్‌నేమ్ పెట్టామ’న్నది. జనాలు మాత్రం నేను ఏ సీరియల్ చేస్తే ఆ సీరియల్లో నా క్యారెక్టర్ పేరుతోనే పిలుస్తుంటారు.
మీది హైదరాబాదేనా?
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మా సొంతూరు. కానీ, మేము హైదరాబాద్‌లోనే ఉంటాం. నాన్న నగేశ్ డాక్టర్..భువనగిరిలో నా పేరు మీద హాస్పిటల్ కూడా పెట్టారు. అమ్మ స్వాతి. మాకు హార్లెస్ ఫైన్ బేకరీస్ ఉన్నాయి. అవి చూసుకుంటుంది. నేను కూడా ఇక్కడే యాక్ట్ చేస్తున్నాగా. అందుకే అందరం ఇక్కడే ఉంటున్నాం. బుల్లి తమ్ముడు ఉన్నాడు.
ఇప్పటి వరకు ఎన్ని సీరియల్స్ చేశావ్?
ఫస్ట్ మాటీవీలో ‘చిట్టితల్లి’ అనే సీరియల్ చేశా. అప్పటికి నాకు యాక్టింగ్ తెలియదు కదా! దాంతో షూటింగ్ మొదటి రోజు చాలా భయమేసింది. కానీ, రెండో రోజుకి అందరూ ఫ్రెండ్స్ అయిపోయారు. భయమంతా పోయింది. ఆ తర్వాత ‘నెంబర్ వన్ కోడలు’, ‘చదరంగం’ సీరియల్స్‌లోనూ చేశా. ఇప్పుడు ‘దేవత’లో దేవమ్మ క్యారెక్టర్ చేస్తున్నా. సినిమాల్లో కూడా చేస్తున్నా. నేను నటించిన ‘గాడ్ ఫాదర్’, ‘రంగమార్తాండ’ సినిమాలు త్వరలోనే రిలీజ్ అవుతున్నాయి. ఒక వెబ్ సిరీస్‌లో కూడా యాక్ట్ చేశా.
ఈ అవకాశాలన్నీ ఎలా వచ్చాయి?
చిన్నప్పట్నించీ నన్ను అమ్మ బేబీ కాంటెస్ట్లకి తీసుకెళ్లేదట. నేనేమో రైతులు, చిన్న పిల్లలపై జరుగుతున్న దాడుల మీద టిక్‌టాక్ వీడియోలు చేసేదాన్ని. అవి బాగుండటంతో అందరూ నన్ను మెచ్చుకునేవాళ్లు. నా వీడియోల్ని వాట్సాప్‌లో స్టేటస్లు పెట్టుకునేవాళ్లు. అలా రైతుల గురించి నేను చేసిన ఒక టిక్‌టాక్ వీడియోని నమ్రత శిరోడ్కర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ‘యు ఆర్ ఆల్రెడీ స్టార్ బేబీ’ అని మెచ్చుకుంది కూడా. అలా నేను అందరికీ తెలియడంతో ‘చిట్టితల్లి’లో అవకాశం వచ్చిందని అమ్మ చెప్పింది. కానీ, నేను యాక్ట్ చేయడాన్ని నాన్న ఫస్ట్ ఒప్పుకోలేదట.
నాన్నకి నువ్వు యాక్టింగ్ చేయడం నచ్చదా?
నేను చిన్నపిల్లని కదా. చదువు పాడవుతుందని నాన్న వద్దన్నారు. కానీ, ఓ సారి నాన్న ఒక మీటింగ్‌కి వెళ్తే ఓ ఐఏఎస్ అంకుల్.. ‘‘నేను ఐఏఎస్ ఆఫీసర్ అని.. నా అంతట నేను చెప్పేవరకు ఎవరికీ తెలియదు. కానీ, మీ పాపని చాలామంది గుర్తుపడతారు. తనకి యాక్టింగ్ ఇష్టం ఉంటే చేయనివ్వండ’’ని చెప్పారట. అప్పట్నించీ నాన్న కూడా సపోర్ట్ చేస్తున్నారు.
అన్ని గంటల షూటింగ్ ఇబ్బంది అనిపించదా? డైలాగ్స్ ఎలా గుర్తుపెట్టుకుంటావ్?
షాట్స్ తీసుకుంటున్నంత సేపు ఏం అనిపించదు నాకు. కానీ, బ్రేక్ ఇస్తేనే చిరాకొస్తుంది. ఏం తోచదు. అటు ఇటు తిరుగుతా. అందర్నీ ఆటపట్టిస్తా కూడా. కానీ, నన్ను ఎవరూ ఏం అనరు. నేనేం అడిగినా వెంటనే తెచ్చిస్తారు కూడా. డైలాగ్స్‌ను అమ్మ హాఫ్ డే ప్రాక్టీస్ చేయిస్తుంది. పెద్ద డైలాగ్స్‌ను అయితే ప్రాంప్టింగ్ కూడా చెప్తారు. లేదంటే నాకు డబ్బింగ్ చెప్పేవాళ్లు కవర్ చేస్తారు.
సీన్‌కి తగ్గట్టు ఎక్స్ప్రెషన్స్ ఎవరు నేర్పిస్తారు?
మామూలుగా అయితే నేనే చేసేస్తా. కానీ ఏడుపు సీన్లు అంటే మాత్రం ఆ సీన్‌ని అమ్మ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అందులో నన్ను ఊహించుకుని ఏడుస్తా. లేదంటే వాటర్ స్ప్రే కొడతారు. లైట్లని ఎక్కువసేపు చూసి... కొన్నిసార్లు ఏడుస్తా.
బయటికెళ్తే అందరూ నిన్ను గుర్తు పడతారు కదా..
‘‘నువ్వు దేవత సీరియల్లో చేస్తావు కదా! నువ్వు దేవమ్మవి కదా’’ అని ఫొటోలు దిగుతారు.
‘‘ తెలంగాణ బాగా మాట్లాడతావ్’’ అని కూడా చెప్తారు. కానీ, తర్వాత ఎపిసోడ్స్‌లో ఏం జరుగుతుందని అడుగుతుంటారు. అది సీక్రెట్ కదా.. అందుకే ఎంత బతిమలాడినా చెప్పను.
యాక్టింగ్ ఓకే.. మరి చదువు?
నాలుగో క్లాస్ చదువుతున్నా. షూటింగ్స్ వల్ల రోజూ స్కూల్‌కి వెళ్లలేను.. అందుకే ట్యూషన్ చెప్పిస్తోంది అమ్మ. షూటింగ్స్‌కి వెళ్లినప్పుడు స్కూల్ ఫ్రెండ్స్‌ని కొంచెం మిస్ అవుతా. షూటింగ్ లేకపోతే ఫ్రెండ్స్‌తో బాగా ఆడుకుంటా. దేవమ్మ.. అంటూ ఫొటోలు దిగుతరు. ఈ చిన్నారి వయసు కేవలం తొమ్మిదేండ్లు. కానీ, ఇప్పటికే బోలెడు సినిమాల్లో యాక్ట్ చేస్తోంది. సీరియల్స్‌లోనూ నటిస్తోంది. తన మార్క్ యాక్టింగ్‌తో ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న ఈ లిటిల్ స్టార్ అసలు పేరు అహానా. ఇంత చిన్న వయసులో పేజీల పేజీల డైలాగులు ఎలా గుర్తు పెట్టుకుంటావ్? రోజుల తరబడి షూటింగ్ ఇబ్బంది అనిపించదా? అని అడిగితే.. ‘‘నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. అందుకే కష్టమనిపించవు అంటోంది.
నీ పూర్తి పేరేంటి?
నా అసలు పేరు పానుగోతు అహానా. కానీ, ఇంట్లో అందరూ నన్ను బర్ఫీ అంటారు. ఎందుకలా పిలు స్తారని అమ్మని అడిగితే.. ‘నువ్వు పుట్టినప్పుడు నాలుగున్నర కేజీలు ఉన్నావ్. అందుకే ‘బర్ఫీ’ అనే నిక్‌నేమ్ పెట్టామ’న్నది. జనాలు మాత్రం నేను ఏ సీరియల్ చేస్తే ఆ సీరియల్లో నా క్యారెక్టర్ పేరుతోనే పిలుస్తుంటారు.
మీది హైదరాబాదేనా?
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మా సొంతూరు. కానీ, మేము హైదరాబాద్‌లోనే ఉంటాం. నాన్న నగేశ్ డాక్టర్..భువనగిరిలో నా పేరు మీద హాస్పిటల్ కూడా పెట్టారు. అమ్మ స్వాతి. మాకు హార్లెస్ ఫైన్ బేకరీస్ ఉన్నాయి. అవి చూసుకుంటుంది. నేను కూడా ఇక్కడే యాక్ట్ చేస్తున్నాగా. అందుకే అందరం ఇక్కడే ఉంటున్నాం. బుల్లి తమ్ముడు ఉన్నాడు.
ఇప్పటి వరకు ఎన్ని సీరియల్స్ చేశావ్?
ఫస్ట్ మాటీవీలో ‘చిట్టితల్లి’ అనే సీరియల్ చేశా. అప్పటికి నాకు యాక్టింగ్ తెలియదు కదా! దాంతో షూటింగ్ మొదటి రోజు చాలా భయమేసింది. కానీ, రెండో రోజుకి అందరూ ఫ్రెండ్స్ అయిపోయారు. భయమంతా పోయింది. ఆ తర్వాత ‘నెంబర్ వన్ కోడలు’, ‘చదరంగం’ సీరియల్స్‌లోనూ చేశా. ఇప్పుడు ‘దేవత’లో దేవమ్మ క్యారెక్టర్ చేస్తున్నా. సినిమాల్లో కూడా చేస్తున్నా. నేను నటించిన ‘గాడ్ ఫాదర్’, ‘రంగమార్తాండ’ సినిమాలు త్వరలోనే రిలీజ్ అవుతున్నాయి. ఒక వెబ్ సిరీస్‌లో కూడా యాక్ట్ చేశా.
ఈ అవకాశాలన్నీ ఎలా వచ్చాయి?
చిన్నప్పట్నించీ నన్ను అమ్మ బేబీ కాంటెస్ట్లకి తీసుకెళ్లేదట. నేనేమో రైతులు, చిన్న పిల్లలపై జరుగుతున్న దాడుల మీద టిక్‌టాక్ వీడియోలు చేసేదాన్ని. అవి బాగుండటంతో అందరూ నన్ను మెచ్చుకునేవాళ్లు. నా వీడియోల్ని వాట్సాప్‌లో స్టేటస్లు పెట్టుకునేవాళ్లు. అలా రైతుల గురించి నేను చేసిన ఒక టిక్‌టాక్ వీడియోని నమ్రత శిరోడ్కర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ‘యు ఆర్ ఆల్రెడీ స్టార్ బేబీ’ అని మెచ్చుకుంది కూడా. అలా నేను అందరికీ తెలియడంతో ‘చిట్టితల్లి’లో అవకాశం వచ్చిందని అమ్మ చెప్పింది. కానీ, నేను యాక్ట్ చేయడాన్ని నాన్న ఫస్ట్ ఒప్పుకోలేదట.
నాన్నకి నువ్వు యాక్టింగ్ చేయడం నచ్చదా?
నేను చిన్నపిల్లని కదా. చదువు పాడవుతుందని నాన్న వద్దన్నారు. కానీ, ఓ సారి నాన్న ఒక మీటింగ్‌కి వెళ్తే ఓ ఐఏఎస్ అంకుల్.. ‘‘నేను ఐఏఎస్ ఆఫీసర్ అని.. నా అంతట నేను చెప్పేవరకు ఎవరికీ తెలియదు. కానీ, మీ పాపని చాలామంది గుర్తుపడతారు. తనకి యాక్టింగ్ ఇష్టం ఉంటే చేయనివ్వండ’’ని చెప్పారట. అప్పట్నించీ నాన్న కూడా సపోర్ట్ చేస్తున్నారు.
అన్ని గంటల షూటింగ్ ఇబ్బంది అనిపించదా? డైలాగ్స్ ఎలా గుర్తుపెట్టుకుంటావ్?
షాట్స్ తీసుకుంటున్నంత సేపు ఏం అనిపించదు నాకు. కానీ, బ్రేక్ ఇస్తేనే చిరాకొస్తుంది. ఏం తోచదు. అటు ఇటు తిరుగుతా. అందర్నీ ఆటపట్టిస్తా కూడా. కానీ, నన్ను ఎవరూ ఏం అనరు. నేనేం అడిగినా వెంటనే తెచ్చిస్తారు కూడా. డైలాగ్స్‌ను అమ్మ హాఫ్ డే ప్రాక్టీస్ చేయిస్తుంది. పెద్ద డైలాగ్స్‌ను అయితే ప్రాంప్టింగ్ కూడా చెప్తారు. లేదంటే నాకు డబ్బింగ్ చెప్పేవాళ్లు కవర్ చేస్తారు.
సీన్‌కి తగ్గట్టు ఎక్స్ప్రెషన్స్ ఎవరు నేర్పిస్తారు?
మామూలుగా అయితే నేనే చేసేస్తా. కానీ ఏడుపు సీన్లు అంటే మాత్రం ఆ సీన్‌ని అమ్మ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అందులో నన్ను ఊహించుకుని ఏడుస్తా. లేదంటే వాటర్ స్ప్రే కొడతారు. లైట్లని ఎక్కువసేపు చూసి... కొన్నిసార్లు ఏడుస్తా.
బయటికెళ్తే అందరూ నిన్ను గుర్తు పడతారు కదా..
‘‘నువ్వు దేవత సీరియల్లో చేస్తావు కదా! నువ్వు దేవమ్మవి కదా’’ అని ఫొటోలు దిగుతారు.
‘‘ తెలంగాణ బాగా మాట్లాడతావ్’’ అని కూడా చెప్తారు. కానీ, తర్వాత ఎపిసోడ్స్‌లో ఏం జరుగుతుందని అడుగుతుంటారు. అది సీక్రెట్ కదా.. అందుకే ఎంత బతిమలాడినా చెప్పను.
యాక్టింగ్ ఓకే.. మరి చదువు?
నాలుగో క్లాస్ చదువుతున్నా. షూటింగ్స్ వల్ల
రోజూ స్కూల్‌కి వెళ్లలేను.. అందుకే ట్యూషన్ చెప్పిస్తోంది అమ్మ. షూటింగ్స్‌కి వెళ్లినప్పుడు స్కూల్ ఫ్రెండ్స్‌ని కొంచెం మిస్ అవుతా. షూటింగ్ లేకపోతే ఫ్రెండ్స్‌తో బాగా ఆడుకుంటా. ::: ఆవుల యమున
టిక్‌టాక్ వీడియోలతో..
ఐదేండ్ల కిందట ఇండియాస్ క్యూటెస్ట్ బేబీ కాంటెస్ట్‌కి అహానా ఫొటోలు పంపించా. ఆ కాంటెస్ట్‌లో టాప్–30 వరకు వెళ్లిన కంటెస్టెంట్స్‌తో క్యాలెండర్ లాంచ్ చేశారు. అలా క్యాలెండర్‌పై అహానా ఫొటోలు చూసి మైత్రి మూవీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయింది. కానీ, ఆ ఇన్స్పిరేషన్తో తనని మరిన్ని కాంటెస్ట్లకి తీసుకెళ్లా. చిన్నపిల్లలతో సోషల్ మెసేజ్‌లు ఇప్పిస్తే ఎక్కువ రీచ్ ఉంటుందని ఆ కాన్సెప్ట్‌లో టిక్‌టాక్ వీడియోలు చేయించాం. అవే తనని ఈరోజు ఇక్కడి వరకు తీసుకొచ్చాయి. కృష్ణవంశీ ‘‘మహానటిని మించి పోతుంద’’ని కాంప్లిమెంట్ ఇచ్చారు. చాలామంది మీరు అహానా మదర్ కదా! అని అడుగుతుం టారు. మా పాపని ఇంతమంది అభిమానించడం సంతోషంగా ఉందంటోంది అహానా తల్లి స్వాతి.