పెద్దపల్లి, వెలుగు: మంథని ప్రాంతంలోని దేవాలయాల అభివృద్ధికి ప్రణాళికలు రెడీ చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ అధికారులకు సూచించారు. మంగళవారం ఆమె మంథనిలోని మహాలక్ష్మి దేవాలయంలో ఆ శాఖ ప్రత్యేక కమిషనర్ హన్మంతరావు, పెద్దపల్లి కలెక్టర్ శ్రీ హర్షతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గౌతమేశ్వర దేవాలయాన్ని సందర్శించారు.
అనంతరం మున్సిపల్ ఆఫీసులో దేవాలయాలు పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయడంపై అధికారులతో రివ్యూ చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడుతూ కాళేశ్వరం, -మంథని,- రామగిరి సర్క్యూట్ ను అభివృద్ధి చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. సమావేశంలో ఆర్డీవో వి.హనుమా నాయక్, పురావస్తు శాఖ, దేవాదాయశాఖ అధికారులు పాల్గొన్నారు.