ఇంగ్లాండ్ తో స్వదేశంలో జరుగుతున్న సిరీస్ లో చాలా మంది కొత్త ప్లేయర్లు అరంగేట్రం చేశారు. రజత్ పటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, ఆకాశ్ దీప్‌లు భారత జట్టు తరపున టెస్ట్ అరంగేట్రం చేశాడు. తాజాగా ధర్మశాల టెస్టుకు మరో ప్లేయర్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. రంజీల్లో అద్భుత ప్రదర్శన చేస్తున్న దేవ్ దత్ పడికల్ కు చివరి టెస్టులో ఆడే అవకాశం ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అదే జరిగితే పేలవ ఫామ్ లో ఉన్న రజత్ పటిదార్ కు బెంచ్ కు పరిమితం కాక తప్పదు.
పటిదార్ స్థానంలో దేవదత్ పడిక్కల్‌కు ధర్మశాల టెస్ట్ మ్యాచ్‌లో అవకాశం ఇవ్వవచ్చని బీసీసీఐ వర్గాలు ఆలోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో సిరీస్ లో అందరూ ఆకట్టుకుంటున్నా.. రజత్ పటిదార్ మాత్రం పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. సాధారణంగా భారత జట్టులో అవకాశాలు రావడం చాలా అరుదు. కానీ పటిదార్ మాత్రం వరుస అవకాశాలు వస్తున్నా సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు.
కోహ్లీ, రాహుల్ గాయాలతో లక్కీగా జట్టులో చోటు దక్కించుకున్న ఈ మధ్య ప్రదేశ్ ఆటగాడు ఆడిన మూడు టెస్టుల్లో 6 ఇన్నింగ్స్ ల్లో 63 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సిరీస్‌లో రెండో టెస్టులో 32 పరుగులు చేసి పర్వాలేదనిపించినా.. ఆ తర్వాత వరుసగా.. 9,5, 0,17, 0 స్కోర్లు నమోదు చేశాడు. ఆడిన ఆరు ఇన్నింగ్సుల్లోనే రెండు సార్లు డకౌట్ అయ్యాడు. దీంతో నెటిజన్స్ ఈ ప్లేయర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
ALSO READ :- Sreemukhi: నాకు వయసు పెరిగిపోతోంది.. పెళ్లిపై శ్రీముఖి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఈ సిరీస్ ద్వారానే టెస్టుల్లో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్ తొలి టెస్టులోనే రెండు హాఫ్ సెంచరీలు చేసి ఆకట్టుకున్నాడు. వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 90 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. రాంచీ టెస్టులో అరంగేట్రం చేసిన ఆకాశ్ దీప్ తొలి ఇన్నింగ్స్ లో మూడు వికెట్లు తీసి సత్తా చాటాడు. మర్చి 7 నుంచి 11 వరకు ధర్మశాలలో ఐదో టెస్ట్ జరుగుతుంది.
Devdutt Padikkal is likely to make his Test debut in the 5th Test against England. [HT] pic.twitter.com/idZgRabVLI
— Johns. (@CricCrazyJohns) February 29, 2024