క్రికెట్ లో గ్రేట్ క్యాచులు అందుకోవడం ఒకప్పుడు అరుదుగా చూసేవాళ్ళం. కానీ టీ20 లీగ్ లు ఎక్కువైన తరుణంలో ఒక్క క్యాచ్ మ్యాచ్ ని డిసైడ్ చేసేస్తోంది. దీంతో బ్యాటింగ్, బౌలింగ్ మీదే కాదు ఫీల్డింగ్ మీద కూడా ప్లేయర్లు ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలో క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు నమ్మశక్యం కానీ రీతిలో క్యాచులు అందుకుంటూ అభిమానులని థ్రిల్ కి గురి చేశారు. ఐపీఎల్, బిగ్ బాష్ లీగ్ లాంటి మెగా టోర్నీలే కాదు టెస్ట్ క్రికెట్ లోనూ గ్రేట్ క్యాచ్ లు అందుకొని ఔరా అనిపిస్తున్నారు.
ఒకదానికి మించి మరో క్యాచ్ ని అందుకుంటూ ఆడియన్స్ కి కిక్ ఇస్తోనే ఉన్నారు. తాజాగా అలాంటి క్యాచ్ ఒకటి ఇరానీ కప్ లో నమోదయింది. ముంబైతో జరుగుతున్న మ్యాచ్ లో రెస్టాఫ్ ఇండియా ప్లేయర్ దేవదత్ పడిక్కల్ స్లిప్ లో తీసుకున్న ఒక క్యాచ్ ఒకటి సంచలనంగా మారుతుంది. ముఖేశ్ కుమార్ బౌలింగ్ లో పృథ్వి షా డ్రైవ్ కు డిఫెన్స్ చేద్దామనుకుంటే బంతి ఎడ్జ్ అయ్యి సెకండ్ స్లిప్ కు దూరంగా వెళ్తుంది. ఈ క్యాచ్ ను పడిక్కల్ ఫుల్ లెంగ్త్ డైవ్ చేసి ఒడిసిపట్టాడు. దాదాపు అసాధ్యమనుకున్న క్యాచ్ ను పట్టి ఆశ్చర్యానికి గురి చేశాడు. బ్యాటర్ పృథ్వి షా కాసేపు అలాగే షాక్ లో ఉండిపోయాడు.
Also Read :- ఒంటిచేత్తో మ్యాచ్ గెలిపించిన దక్షిణాఫ్రికా స్టార్
ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేస్తున్న ముంబై ప్రస్తుతం రెండో రోజు టీ విరామ సమయానికి 6 వికెట్ల నష్టానికి 449 పరుగులు చేసింది. సర్ఫరాజ్ ఖాన్ (177) డబుల్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. అతనితో పాటు తనిష్ కొటియన్ (59) హాఫ్ సెంచరీతో క్రీజ్ లో ఉన్నాడు. కెప్టెన్ అజింక్య రహానే 97 పరుగులు చేసి తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. తొలి రోజు అయ్యర్ 57 పరుగులు చేసి రాణించాడు.
Devdutt Padikkal made it look so easy 🤩#IraniTrophy #IraniTrophyFinal #DevduttPadikkal #PrithviShaw
— CREX (@Crex_live) October 1, 2024
pic.twitter.com/uOGCxfZN17