ఆర్థిక సంక్షోభం నుంచి  దేశాన్ని గట్టెక్కించారు : హెచ్ డీ దేవెగౌడ

ఆర్థిక సంక్షోభం నుంచి  దేశాన్ని గట్టెక్కించారు : హెచ్ డీ దేవెగౌడ

బెంగళూరు : మాజీ ప్రధాని మన్మోహన్  సింగ్  మృతి దేశానికి తీరని లోటు అని జేడీఎస్  అధినేత, మాజీ ప్రధాని  హెచ్ డీ దేవెగౌడ అన్నారు. ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని మన్మోహన్  గట్టెక్కించారని ఆయన కొనియాడారు. శుక్రవారం బెంగళూరులో మీడియాతో దేవెగౌడ  మాట్లాడారు. ‘‘మన్మోహన్ సింపుల్​గా, నిజాయితీగా ఉండేవారు. ఆయన ఓ జెంటిల్ మ్యాన్. 1990వ దశకం ఆరంభంలో దేశం ఆర్థికంగా చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంది.

ఆ పరిస్థితుల్లో కేంద్ర ఆర్థిక మంత్రిగా ఆయన  బాధ్యతలు చేపట్టారు. నాటి ప్రధాని పీవీ నరసింహారావు ఆధ్వర్యంలో ఎన్నో సంస్కరణలు అమలుచేసి దేశాన్ని కాపాడారు. మన్మోహన్  ప్రవేశపెట్టిన సంస్కరణల్లో సరళీకరణ, ప్రైవేటీకరణ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వంటివి కొన్ని” అని దేవెగౌడ పేర్కొన్నారు.