ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మహబూబ్​నగర్​  జిల్లా  సంక్షిప్త వార్తలు

ధరణి సమస్యలపై రిపోర్ట్ ఇవ్వండి : కలెక్టర్ వల్లూరు క్రాంతి

గద్వాల, వెలుగు:  ధరణి సమస్యలపై ఫీల్డ్ విజిట్ చేసి రిపోర్ట్ ఇవ్వాలని  కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆఫీసర్లను ఆదేశించారు. సోమవారం తన చాంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  రెవెన్యూ, ఇరిగేషన్ ఆఫీసర్లతో మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్లతో పాటు గట్టు లిఫ్ట్‌‌‌‌‌‌‌‌  భూసేకరణ  వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రేవులపల్లి,చిన్నోనిపల్లి, ఆలూరు, గార్లపాడు, నాగర్ దొడ్డి, ర్యాలంపాడు ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్లలో  పెండింగ్‌‌‌‌‌‌‌‌  పనులను వెంటనే కంప్లీట్ చేయాలన్నారు. గట్టు లిఫ్ట్ భూసేకరణ పనులను స్పీడప్ చేయాలని ఆదేశించారు. ధరణి సమస్యలపై స్పెషల్ ఫోకస్‌‌‌‌‌‌‌‌ పెట్టాలని, డౌట్స్ ఉంటే తన దృష్టికి తేవాలని సూచించారు.  ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాములు, తహసీల్దార్లు, ఇరిగేషన్ డీఈ, ఈఈలు  పాల్గొన్నారు.

71 మందిపై హిస్టరీ షీట్ క్లోజ్ : డీఎస్పీ సత్యనారాయణ


నారాయణపేట, వెలుగు: నారాయణపేట జిల్లాలో సత్ర్పవర్తనతో మెలుగుతున్న 71 మందిపై హిస్టరీ షీట్స్‌‌‌‌‌‌‌‌ను క్లోజ్​ చేస్తున్నట్లు డీఎస్పీ సత్యనారాయణ ప్రకటించారు.  మంగళవారం ఎస్పీ కార్యాలయంలో రౌడీ షీట్స్, సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ అయిన వారికి హిస్టరీ షీట్స్‌‌‌‌‌‌‌‌ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా  డీఎస్పీ మాట్లాడుతూ  జిల్లా పరిధిలో ఇప్పటివరకు  రౌడీషీటర్లు 65 మంది, సస్పెక్ట్స్ 190,  కేడీ ఒకరు , కమ్యూనల్ సస్పెక్స్-39, పాత నేరస్తులు130పై  హిస్టరీ షీట్స్ మెయింటేన్ చేస్తున్నామన్నారు.  మొత్తం 438 మందిలో 71 మందిపై హిస్టరీ షీట్‌‌‌‌‌‌‌‌ ఎత్తివేస్తున్నామని తెలిపారు.  మళ్లీ చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే   చర్యలు తప్పవని  హెచ్చరించారు. రౌడీషీటర్లపై నిరంతరం నిఘా కొనసాగుతోందని,   భూకబ్జాలు, సెటిల్మెంట్లలో తల దూర్చినా, అల్లర్లకు  పాల్పడినా, మహిళలను వేధించినా.. హిస్టరీ షిటర్స్ ఓపెన్ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీఐలు శ్రీకాంత్ రెడ్డి, సీతయ్య, జనార్ధన్, ఆర్​ఐ కృష్ణయ్య, ఎస్సై లు జగదీశ్వర్, సురేశ్, పర్వతాలు, సతీశ్, నరేందర్, అశోక్ బాబు, శ్రీనివాసులు, విక్రమ్,రమేశ్, శ్రీనివాస రావు, సునీత డీసీఆర్బీ, ఐటీ సిబ్బంది పాల్గొన్నారు.


మినీ స్టేడియాన్ని డెవలప్ చేస్తాం : ఎక్సైజ్, క్రీడా శాఖ  మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ 


అచ్చంపేట,  వెలుగు:  అచ్చంపేటలోని ఎన్‌‌‌‌‌‌‌‌టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  మినీ స్టేడియాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేస్తామని  ఎక్సైజ్​, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హామీ ఇచ్చారు.   పది రోజులుగా అచ్చంపేటలో నిర్వహిస్తున్న  జీబీఆర్​ ఆల్ఇండియా లెవల్​ క్రికెట్​ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి చీఫ్‌‌‌‌‌‌‌‌ గెస్టుగా హాజరయ్యారు.  విన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచిన అర్పాన్​ సీసీ, - గ్రీన్​ సీటీ టీమ్‌‌‌‌‌‌‌‌లకు ట్రోఫీ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నల్లమలలోని ఆణిముత్యాలను వెలికితీసేందుకు ఇలాంటి టోర్నమెంట్లు దోహదం చేస్తాయన్నారు. ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని, నియోజకవర్గ కేంద్రాల్లోనే కాదు ప్రతి గ్రామంలో ప్లే గ్రౌండ్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేస్తోందని చెప్పారు.  గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ కోటా కింద  రెండు శాతం రిజర్వేషన్​ కల్పిస్తోందన్నారు. ఈకార్యక్రమంలో  ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, మున్సిపల్​ చైర్మన్ నర్సింహ్మ గౌడ్​, ఎంపీపీ శాంతాబాయి, జడ్పీటీసీ మంత్ర్యానాయక్​, నేతలు మనోహర్​, రాజేశ్వర్​ రెడ్డి, తులసీరాం  
పాల్గొన్నారు. 

రైతులకు శాపంగా మారిన ధరణి

మహబూబ్​నగర్​ టౌన్​, వెలుగు : ధరణి పోర్టల్‌‌‌‌‌‌‌‌ రైతులకు శాపంగా మారిందని, సమస్యలు పెరిగాయే తప్ప తగ్గలేదని బీజేపీ నేతలు విమర్శించారు. మంగళవారం ఉమ్మడి జిల్లాలో ఐదు కలెక్టరేట్ల వద్ద రైతు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రైతులకు ఇచ్చిన రూ.లక్ష లోపు రుణమాఫీ, ఉచిత ఎరువుల హామీలు ఎమయ్యాయని ప్రశ్నించారు.  రైతులకు ఏదైనా సమస్య వస్తే ధరణిలో రూ. 1100 పెట్టి అప్లికేషన్‌‌‌‌‌‌‌‌ పెట్టుకోవాల్సి వస్తుందని,  రిజెక్ట్‌‌‌‌‌‌‌‌ అయితే  మళ్లీ డబ్బులు చెల్లించాల్సి వస్తుందని వాపోయారు.  రైతులను ఇబ్బందిగా మారిన ధరణిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంపై బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ పెద్దలు చేస్తున్న ఆరోపణలు బూటకమని విమర్శించారు. ఉపాధి హామీ నిధులు దారి మళ్లించి కేంద్రంపై నింద వేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్లకు వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు వీరబ్రహ్మచారి, రామచంద్రారెడ్డి, రాజవర్దన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి, పగుడాకుల శ్రీనివాసులు, బీసీ కమిషన్ మాజీ మెంబర్ ఆచారి, స్టేట్ లీడర్లు నాగురావు నామాజీ, బంగారు శ్రుతి,  దిలీప్ ఆచారి,  కొల్లి మాధవి,  స్నిగ్ద రెడ్డి, సబి రెడ్డి వెంకట్ రెడ్డి,బి.కృష్ణ, బి.శ్రీశైలం, చంద్రశేఖర్,  పద్మజారెడ్డి,  సుబ్బారెడ్డి, నరేందర్, సుదర్శన్​రెడ్డి, ఎన్పీ వెంకటేశ్, ఆయా జిల్లాల నేతలు 
పాల్గొన్నారు.


బిల్స్‌‌‌‌‌‌‌‌ ఇచ్చినం కదా.. లేట్‌‌‌‌‌‌‌‌ ఏంటి?
కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై మండిపడ్డ  హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్
 


నాగర్​ కర్నూల్, ​వెలుగు:  ‘ఎస్సీ ఆఫీస్​ ఇనాగరేషన్‌‌‌‌‌‌‌‌కు ఇప్పటికే డేట్​ ఫిక్స్​ చేసినం..  ఇక్కడ చూస్తే ఎక్కడిపనులు అక్కడే ఉన్నయి. బిల్స్​ మొత్తం ఇచ్చినం కదా.. ఇంకా ఫస్ట్​ ప్లోర్​కూడా కంప్లీట్​ కాలేదు.. ఇంత జాప్యం ఏంటి’ అని పోలీస్​ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్​ కె.దామోదర్, ఎండీ సంజయ్​ కుమార్​ జైన్​​ కాంట్రాక్టర్​పై  ఆగ్రహం వ్యక్తం చేశారు.  జనవరి ఫస్ట్‌‌‌‌‌‌‌‌ వీక్‌‌‌‌‌‌‌‌లోగా ఫస్ట్​ ఫ్లోర్​ కంప్లీట్ చేసి ఇవ్వాల్సిందేనని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.  మంగళవారం కొల్లాపూర్​ చౌరస్తాలో నిర్మిస్తున్న డిస్ట్రిక్​ పోలీస్ హెడ్​ క్వార్టర్​ ఆఫీస్​ బిల్డింగ్​ పనులను పరిశీలించారు. ఎంట్రెన్స్ ఆర్చ్, గ్రౌండ్, ఫస్ట్​ ఫ్లోర్ ఫ్లోరింగ్,  వైరింగ్, డోర్స్ అన్ని అసంపూర్తిగా ఉండడంతో అసహనం వ్యక్తం చేశారు.  పనులన్నీ  పెండింగ్​ పెట్టి డిసెంబర్​ 29లోగా కంప్లీట్​ చేస్తామని ఎలా చెప్తారని కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై మండిపడ్డారు.  బిల్లులు ఇచ్చినా పనులు స్లోగా చేయడం ఏంటని ప్రశ్నించారు. ఇప్పటి నుంచి హౌజింగ్ కార్పొరేషన్​ సీఈ, ఎస్ఈ, ఈఈ  సూపర్​వైజ్ చేయాలని ఆదేశించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ  నాగర్​ కర్నూల్‌‌‌‌‌‌‌‌తో పాటు గద్వాల, వనపర్తి డీపీవో పనులు దాదాపుగా  చివరిదశలో ఉన్నాయని, త్వరలోనే సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రారంభిస్తారని చెప్పారు.    ఎస్పీ కె.మనోహర్​, డీఎస్పీ మోహన్​ కుమార్, ఏఆర్ అడిషనల్ ఎస్సీ భరత్​కుమార్​ వారి వెంట 
ఉన్నారు.     

పొత్తు పొత్తే.. పోరాటం పోరాటమే 
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి  సాంబశివ రావు

గద్వాల, వెలుగు:  బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌తో పొత్తు పెట్టుకున్నా ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటం మాత్రం ఆపేది లేదని - సీపీఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు స్పష్టం చేశారు.  గట్టు మండల పరిధిలోని చిన్నోనిపల్లి రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వాసితులు చేస్తున్న దీక్షకు మంగళవారం సంఘీభావం తెలిపారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి ఆయకట్టు లేని రిజర్వాయర్ ని రద్దు చేయాలని నిర్వాసితులు 334 రోజులుగా దీక్ష చేస్తున్నా సర్కారు పట్టించుకోకపోవడం సరికాదన్నారు.  ప్రభుత్వానికి ఆర్టీఐ కింద అప్లికేషన్‌‌‌‌‌‌‌‌ పెడితే రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కింద ఎలాంటి ఆయకట్టు లేదని సమాచారం ఇచ్చిందన్నారు.  ప్రస్తుతం అయిజ, మానవపాడు, వడ్డేపల్లి, ఉండవెల్లి  మండలాలకు నీళ్లు తీసుకెళ్తామని చెబుతోందని మండిపడ్డారు. బీజేపీ కరోనా కంటే ప్రమాదకరమని , అందుకే మునుగోడు బై ఎలక్షన్స్‌‌‌‌‌‌‌‌లో బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌కు మద్దతు ఇచ్చామన్నారు. చిన్నోనిపల్లి నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు గోపాల్ రావు, రామచంద్ర గౌడ్  పాల్గొన్నారు.


సీనియర్లను ఏన్నడూ అవమానించలే
కాంగ్రెస్ క్రమశిక్షణ  కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి


వనపర్తి, వెలుగు:   తన 45 ఏండ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ సీనియర్లను అవమానించలేదని మాజీ మంత్రి, కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ జి.చిన్నారెడ్డి క్లారిటీ ఇచ్చారు. మంగళవారం వనపర్తి పట్టణంలోని దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్‌‌‌‌‌‌‌‌లో డీసీసీ ప్రెసిడెంట్ రాజేంద్రప్రసాద్ యాదవ్ అధ్యక్షతన  ‘హాత్ సే హాత్  జోడో అభియాన్’ సన్నాహక సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ పార్టీ సీనియర్ల సహకారంతోనే ఇన్నాళ్లు తాను గెలిచానని, ఇకముందు కూడా వారితో కలిసే పనిచేస్తానని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర సక్సెస్‌‌‌‌‌‌‌‌ అయ్యిందని, రాష్ట్రంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జనవరి 26 నుంచి పాదయాత్ర చేయనున్నారని చెప్పారు.  వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్  అధికారంలోకి రాగానే  రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు‌‌‌‌‌‌‌‌. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుబంధం చేస్తామని,  నకిలీ విత్తనాలు, మందులను అరికట్టేందుకు కఠిన చట్టం తెస్తామని చెప్పారు.  రైతులతో పాటు  కూలీలకు, భూమిలేని పేదలకు బీమా ఇచ్చే దిశగా హైకమాండ్  ఆలోచన చేస్తోందన్నారు.  ఈ సమావేశంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రాధాకృష్ణ,  కౌన్సిలర్ బ్రహ్మం, నేతలు కిరణ్ కుమార్, అక్తర్,  అనిస్, కోట్ల రవి,   రాగి వేణు,  దివాకర్,  బాబా,  చందర్,  జనార్ధన్ , కృష్ణ, బాబు, దేవన్న,  వెంకటేష్,  రోహిత్ పాల్గొన్నారు.

ఆరుతడి పంటలు సాగు చేయాలి : కలెక్టర్ ఉదయ్ కుమార్ 

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు:  యాసంగిలో వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలని  కలెక్టర్  ఉదయ్ కుమార్ సూచించారు.  మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అగ్రికల్చర్, హార్టికల్చర్, భూగర్భజల, ప్రణాళికా శాఖల అధికారులతో  సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరుతడి పంటలైన పెసర, మినుములు, నువ్వులు, మిరప, పత్తి, మొక్కజొన్న, వేరుశనగ తదితర పంటలను సాగు చేసుకునేలా  ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు.  ఈ మేరకు రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.   2023–24 పైనాన్షియల్ ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గాను పంటల ఉత్పత్తి, మార్కెటింగ్ కోసం రూ.3,456.17 కోట్లు,  వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాల కోసం రూ.8,04.57 కోట్లు,  మౌలిక సదుపాయాల కోసం రూ.95.34 కోట్లు, అనుబంధ కార్యకలాపాల కోసం 68.70 కోట్లు,  సూక్మక్ష చిన్న మధ్య తరహా సంస్థల కోసం రూ.4,13.81 కోట్లు అవసరం అవుతాయని నాబార్డు ఆర్థిక ప్రణాళిక అంచనా వేసిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్  భూపాల్ రెడ్డి, డీఏవో వెంకటేశ్వర్లు, హార్టికల్చర్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చంద్రశేఖర రావు, భూగర్భజల అధికారి రమాదేవి,  నాబార్డ్ డీడీఎం కౌశల్ కిషోర్ పాండే, ఎల్డీఎం  భూపాల్ రెడ్డి  పాల్గొన్నారు.  


బడి పనులు త్వరగా కంప్లీట్ చేయాలి : అడిషనల్ కలెక్టర్ మనూ చౌదరి 

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: మన ఊరు–మనబడి పనులు త్వరగా కంప్లీట్ చేసి..  జనవరి 6న ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని అడిషనల్ కలెక్టర్ మనూ చౌదరి ఆదేశించారు.  నాగర్ కర్నూల్ పట్టణ పరిధిలోని సంజయ్ నగర్ ప్రైమరీ స్కూల్‌‌‌‌‌‌‌‌లో రూ.19 .67 లక్షలతో చేపట్టిన పనులను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  పనుల బాధ్యతలను స్కూల్‌‌‌‌‌‌‌‌ కమిటీకే అప్పగించామని,  కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుకోవాలని సూచించారు.  నాణ్యలతో రాజీ పడొద్దని గోడలకు ఎక్కడ  పగుళ్లు రాకుండా చూడాలన్నారు. పైకప్పుకు లీకేజీలు ఉండొద్దని, కిటికీలు, తలుపులు పక్కాగా ఉండాలన్నారు.  జిల్లాలో 40 స్కూళ్లను ఎంపిక చేయగా జనవరి 6న మండలానికి రెండు చోట్ల ఓపెన్‌‌‌‌‌‌‌‌ చేయనున్నామని చెప్పారు. ఆయన వెంట డీఈవో గోవిందరాజులు, ఏఈలు ప్రశాంత్, వెంకటేశ్వర శెట్టి ఉన్నారు.


ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలి
టీపీసీసీ వైస్ ​ప్రెసిడెంట్ ఎర్ర శేఖర్​ 

జడ్చర్ల టౌన్​, వెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ కార్యకర్తలు పోరాటం చేయాలని టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఎర్ర శేఖర్ ​పిలుపునిచ్చారు.  బుధవారం జడ్చర్ల ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌బీ గెస్ట్​హౌజ్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన ‘హాత్ సే హాత్ జోడో అభియాన్’ సన్నాహక సమావేశంలో మాట్లాడారు.  ప్రభుత్వాల వైఫల్యాలతో పాటు భారత్‌‌‌‌‌‌‌‌ జోడో లక్ష్యాన్ని  ప్రతి గడపకు తీసుకెళ్లాలని సూచించారు.  ఇందిరమ్మ ఇండ్లు, ఆరోగ్య శ్రీ లాంటి గతంలో చేపట్టిన పథకాలతో పాటు వచ్చే ఎన్నికల్లో గెలిస్తే చేపట్టే కార్యక్రమాలను వివరించాలన్నారు. జనవరి 26  నుంచి  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టనున్న పాదయాత్రను సక్సెస్ చేయాలని కోరారు.  ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు బుర్ల వెంకటయ్య, నేతలు బుక్క వేంకటేశ్, అశోక్ యాదవ్ , జనార్ధన్ రెడ్డి, మిన్ హజ్, కృష్ణ, కరాటె శ్రీను, యాదయ్య,  ఖాజా అలిమొద్దీన్, మాచారం రాజు పాల్గొన్నారు. 


స్టూడెంట్లకు  ఇబ్బందులు రానివ్వొద్దు
జిల్లా జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి

వీపనగండ్ల (చిన్నంబావి), వెలుగు:  గురుకులాలు, కేజీబీవీ  స్టూడెంట్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని వనపర్తి జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి అధికారులకు సూచించారు.  మంగళవారం చిన్నంబావి మండలంలోని కస్తూర్బా గాంధీ స్కూల్‌‌‌‌‌‌‌‌ను తనిఖీ చేసి చేశారు. తమకు పీఈటీతో పాటు కొన్ని సబ్జెక్టులకు టీచర్లు లేరని స్టూడెంట్లు జడ్పీ చైర్మన్ దృష్టికి తెచ్చారు.  స్పందించిన ఆయన వెంటనే డీఈవోతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని అదేశించారు. కలెక్టర్ నిధుల నుంచి మినరల్ వాటర్ లైన్,  జడ్పీ నిధుల నుండి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తున్నామని చెప్పారు. అనంతరం చిన్నంబావి జీపీలో  సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు.